The content in this feature is rated as "A++". You must be at least 18 years old to view this feature.
Home>>Romantic Stories>>AA Madhura Lshenalu ...
ఆ మధుర క్షణాలు ...

- ముచ్చర్ల రజనీ శకుంతల

"రెండు మనసులు కలిసి, రెండు శరీరాలు ఏకమై, 'రెండు సుఖాలు' ఒక్కటై, మమేకమై ... వేడి నిట్టూర్పుల, తీయటి అనుభూతుల బిగి కౌగిలిలో అవిశ్రాంత పోరాటం చేస్తూ, ఒకరి నొకరు గెలిపించుకునే ప్రయత్నంలో నఖక్షతాల అస్త్రాలతో, చుంబనక్షతాల శాస్త్రాలతో, శృంగార యుద్ధం చేస్తూ ... చిత్రంగా ఇద్దరూ విజేతలే, అయితే ... కోటి కూజితాల మధురాను భూతుల అనుభావేద్య శృంగారమా ... శతమానం భవతి ... శతాశతాయుష్మాన్ భవ ...''

"బామ్మా ... నా మాట వినవే ...'' ప్రపంచంలోని దీనత్వాన్ని మొత్తం తన మొహంలోకి ట్రాన్స్ ఫర్ చేసుకుంటూ, బామ్మ ముందు మోకరిల్లి అడిగాడు తనిష్క్.

"ఒరే మనవడా ... నువ్వీ విషయంలో ఏం చెప్పినా విననంతే ... హవ్వ ... ఎవరైనా వింటే నవ్విపోతారు. మన ఇంటా, వంటా ఇలాంటి చోద్యం ఎరుగుదుమా? అయినా 'కార్యం' సంగతి పెద్దలు చూసుకుంటారు. ఈ ముచ్చట, అచ్చటా చేయాల్సిందే మేము'' అంది బామ్మ తన మాటకు తిరుగులేనట్లు.

"ముచ్చటా, అచ్చటా చేయాల్సింది మీరే ... మరి లోపల ఆ 'ముచ్చటా, అచ్చటా' కూడా మీరే చేస్తారా?'' ఉక్రోషంగా అన్నాడు తనిష్క్.

"నీకన్నీ మీ తాత బుద్ధులే వచ్చాయి. పోరా ... హాయిగా ఆఫీసుకు వెళ్ళి, వచ్చేటప్పుడు బుట్టెడు మల్లెలు తెచ్చుకో కావాలంటే ... రాత్రి పదిన్నరకు మంచి ముహూర్తం'' అంది బామ్మ.

బామ్మ తలను టీసుకేల్లి తమిళనాడు అడవుల్లో వీరప్పన్ స్థావరంలో పాతేసి రావాలన్న కోరికను అతి కష్టం మీద అణచుకున్నాడు. 'ఆ వీరప్పన్ ఈ మూద్రోజులూ నిన్ను కిడ్నాప్ చేసినా బావుండు' మరోసారి కసిగా అనుకున్నాడు.

అసలు విషయానికి వస్తే ...

తనిష్క్ కు, విభ్రమతో పెళ్ళయింది. శోభనం ముచ్చట, బంధుమిత్రుల సమక్షంలో ఈరోజే జరగనుంది. అక్కడే పేచీ వచ్చింది తనిష్క్ కు. అందరికీ చెప్పి, అందరూ చూస్తుండగా అమ్మాయిని గదిలోకి పంపి, తెల్లారి అందరూ తమని చూస్తుంటే సిగ్గుతో చితికిపోయి ... చాలా ఎంబ్రాసింగ్ గా ఉంది తనిష్క్ కు.

తనిష్క్ కు ఈ హంగామా అంతా ఇష్టంలేదు. పదిమందికి చెప్పి, పదిమందితో మధురమైన తొలిరాత్రి జరుపుకోవడం నచ్చలేదు. హాయిగా ఏ ఫైవ్ స్టార్ హోటల్ లోనో, లగ్జరీ సూట్ లోనో జరుపుకోవాలన్న కోరిక అతనిది. ఆ విషయంలోనే బామ్మకు, మనవడు తనిష్క్ కు వార జరిగింది. 'ససేమిరా ... కుదరదని' చెప్పేసింది బామ్మ. తలపట్టుక్కూర్చోవటం తనిష్క్ వంతయింది.

ఈ విషయంలో మౌనప్రేక్షకపాత్ర వహించింది పెళ్ళికూతురు విభ్రమ.

*****

శోభనం గదిని అలంకరిస్తున్నారు. బామ్మ ఆ అలంకరణలను పర్యవేక్షిస్తోంది. ఆ రోజు ఆఫీసులో పనిచూసుకుని రాత్రి ఏడు లోగా వస్తానని చెప్పి వెళ్ళాడు తనిష్క్. పెళ్ళికూతురు విభ్రమని శోభనపు పెళ్ళికూతురుగా ముస్తాబు చేసే కార్యక్రమం మొదలయింది. సరిగ్గా అప్పుడే ఆ ఇంట్లో ఫోన్ మోగింది. బామ్మ రిసీవర్ లిఫ్ట్ చేసింది. అవతలివైపు చెబుతోన్న విషయం విని, రిసీవర్ జార విడిచింది. తనిష్క్ కు యాక్సిడెంట్ అయింది.

స్టార్ హాస్పిటల్ లో అడ్మిట్ చేశారు. బామ్మ కల్లోత్తుకుంది. తనిష్క్ తల్లిదండ్రులు టెన్షన్ గా ఉన్నారు. విభ్రమ షాక్ తగిలినట్టు ఉండిపోయింది. డాక్టర్లు ప్రమాదమేమీ లేదని ఆ రోజు హాస్పిటల్ లోనే వుంచాలని, ఆ రోజంతా అబ్జర్వేషన్ లో ఉంచి, తెల్లారి డిశ్చార్జి చేస్తామని చెప్పారు. మనవాడి దగ్గర తనే ఉంటానని పట్టుబట్టి అందర్నీ ఇంటికి పంపించేసింది బామ్మ.

*****

"అమ్మా ...'' రాత్రి ఎనిమిది అవుతుండగా మెల్లిగా కళ్ళు తెరిచి బాధగా పిలిచాడు తనిష్క్.

"ఏంట్రా పిచ్చికన్నా ... నేను బామ్మని ... ఏం కావాల్రా?'' అడిగింది బామ్మ.

"నువ్వెందుకున్నావే బామ్మా ... నీకేం చేతనవుతుంది?''

"ఫర్లేదులేరా ... చిన్నప్పుడు నా చేతులతో ఎత్తుకోలేదూ ...''

"ఇప్పుడు నన్నెత్తుకుంటే చచ్చూరుకుంటావే ... కాస్త నన్ను లేపవే ...'' అన్నాడు. తన బరువంతా బామ్మమీద వేసి ... కావాలనే.

"చచ్చాన్రా మనవడా'' అంది బామ్మ.

"చచ్చాన్రా కాదు ... ఇలానే మరో నాలుగైదుసార్లు లేస్తే నిజంగా తాతయ్య దగ్గరవెళ్తావ్ ... నీకు వర్కవుట్ అవ్వదు కానీ వెళ్ళి ఎవరినైనా పంపించవే ...'' తనిష్క్ అన్నాడు.

"మీ నాన్నని పంపించేదా?'' అడిగింది బామ్మ.

"నాన్న వల్ల కాదు కాదు''

"పోనీ మీ అమ్మను పంపేదా?''

"అసహ్యంగా ఉంటుంది. నేను బాత్రూమ్ కి వెళ్ళాల్సి వస్తే ... అమ్మను తీసుకెళ్తే ఏం బావుంటుంది''

"మరేం చేయన్రా నాయనా ... పోనీ మీ అత్తయ్యని పంపేదా?'' అని అడిగి, మనవడి మొహంలోని సీరియస్ నెస్ చూసి "అదేంట్రా .. . మొహమాలా మాడిపోయిన దిబ్బ రొట్టెలా పెట్టావు?'' అని అడిగింది.

"లేకపోతే ఏంటే బామ్మా ... నీ మనవరాలిని పంపు. అదే నా పెళ్ళాన్ని ... '' అన్నాడు తల పక్కకు తిప్పుకుని, నీరసమైన ఎక్స్ ప్రెషనిస్తూ.

"అమ్మో ... ఇంకా కార్యం కాకుండా పంపకూడదురా'' అంది లెంపలు వేసుకుంటూ.

"నీ కార్యాన్ని కాకులు ఎత్తుకుపోను, ఓ పక్క నా నడుం విరిగి నేను చస్తుంటే ఇప్పుడా సంగతి ఎందుకు ... అమ్మా ... హబ్బా ...''

బామ్మకు అదీ రైటే అనిపించింది. వెంటనే ఇంటికి వెళ్ళి విభ్రమని పంపించింది. శోభనం పెళ్ళికూతురి అలంకరణలు తీసేసి, సింపుల్ గా హాస్పిటల్ కు వచ్చింది విభ్రమ. ఆ రాత్రి మొగుడికి సేవలు చేయడానికి. నగరంలో అతి ఖరీదైన ఆ హాస్పిటల్ ఫైవ్ స్టార్ హోటల్ రేంజ్ లో ఉంది. ప్రతి గదిలో కలర్ టీవి, కేబుల్ కనెక్షన్, సెంట్రల్ ఎయిర్ కండిషన్ సిస్టం, ట్వంటీఫోర్ అవర్స్ అందుబాటులో ఉండే డాక్టర్లు! బాత్రూమ్ లో షవర్, బాత్ టబ్ ... ఒక్క అనారోగ్యమనే బెంగ తప్ప ఏ బాధా ఉందని భూతల స్వర్గంలా వుంది.

*****

భర్తను అడ్మిట్ చేసిన గదిలోకి అడుగుపెట్టి, కెవ్వున అరవబోయి, బలవంతాన ఆ అరుపును ఆపుకుంది విభ్రమ. బెడ్ మీద సెలైన్ ఎక్కిన్చుకుంటూ భర్త వుంటాడనుకుంది కానీ ఆ గది గెటప్పే మారిపోయింది. ఇంచుమించు సినిమాలోని శోభనం గదిలా ఉంది. మంచం చుట్టూ మల్లెపూతెరలూ, మంచంమీద నాలుగు అంగుళాల మేర మల్లెలు ... పరుపులా పరుచుకుని వున్నాయి. ఫేర్ ఫ్యూమ్ సువాసనలు వెదజల్లుతున్నాయి. కేవలం నీలిరంగు బల్బ్ మాత్రమే ఉంది. నీలి హోయలోలికిస్తూ. హార్ట్ టచ్ చేసే మ్యూజిక్ ... శోభనం పెళ్ళికొడుకు గెటప్ లో తన బెటరాఫ్ ... తనిష్క్.

"వెల్ కమ్ ... వెల్ కమ్ ... విభ్రమా ...'' అన్నాడు రెండు చేతులూ చాచి. అప్పుడు టైం రాత్రి పదిగంటల ఇరవై నిముషాలు.

*****

"ఇది ... ఇదంతా ఏమిటండీ?'' అడిగింది విభ్రమ విభ్రమంగా ....

"ఫస్ట్ నైట్ ... ఊహు ... స్టార్ ... నైట్ ...'' అన్నాడు.

"మరి నీకు యాక్సిడెంట్?''

"అదా ... పోయిందే ... ఇట్స్ గాన్. అదంతా ఓ మిడ్ నైట్ మసాలా స్టోరీకి స్క్రీన్ ప్లే''

"అంటే ...''

"బామ్మ మనల్సి గంగిరెద్దుల్లా తయారుచేసి, అందర్నీ పిలిచి, బొట్టెట్టి శోభనం ఏర్పాటు చేయడం నాకిష్టం లేదు. హాయిగా మనిద్దరమే వుండాలి. ఎవరికీ చెప్పనవసరం లేదు. అందుకే 'యాక్సిడెంట్' డ్రామా ఆడాను. హోటల్ లో రూమ్ బుక్ చేస్తే .. తమ చావుకి కారణం నేనేనని ఉత్తరం రాసి మరీ చస్తానని బామ్మ వార్నింగ్ ఇచ్చింది. ఆవిడను బాధపెట్టడం ఇష్టంలేదు ... అలా అని అందరిముందూ, అందరి మధ్యా శోభనం జరుపుకోవడం ఇష్టం లేదు. అందుకే ఈ ప్లాన్ వేశాను. నాకు తోడుగా నిన్ను ఎలానూ పంపించక తప్పదు''

భర్త ఉద్దేశం అర్థమవ్వటంతోనే విభ్రమ బుగ్గల్లో సిగ్గు గులాబీ రంగులోకి షిఫ్టయింది.

*****

రాత్రి పదిన్నర. విచిత్రంగా ఉంది. మత్తుగా ఉంది, గమ్మత్తుగా ఉంది. తన ప్రియ వల్లభుడు ముద్దుల ముద్రాలే తనకు ప్రాణాధికమైన ఆక్సిజన్. చాలా సింపుల్ గా ఉన్నా, అందంగా ఉంది విభ్రమ. తెల్లటి ఆమె పాదాలు, ఆ పాదాలను చూసి మురిసే వెండిమెట్టెలు ... ఎదపై వేలాడే మంగళ సూత్రాలూ ... విభ్రమ పాదాల దగ్గరికి వచ్చాడు. తనిష్క్ ఆమె పాదాల మీద తన రెండు పాదాలతో టచ్ చేశాడు. విద్యుత్తు పాదాల్లో నుంచి ప్రవహిస్తున్న ఫీలింగ్ విభ్రమలో! తన పెదాలను పాదాలుగా చేసాడు.

పెదాలు పాదాలతో అడుగులు వేస్తూ ఆపాదమస్తకం పెదాల యాత్ర చేసాడు. పలుచటి పొట్ట మీద ఓ చుంబన నక్షతం, లేత పెదాలపై ఓ ముద్దుల ముద్ర, కన్రెప్పల మీద మరో వెచ్చటి ముద్దు ... ఇన్నాళ్ళుగా దాచుకున్న ముద్దుల ఖజానాను, ఆమెకు 'నజరానా'గా సమర్పించుకున్నాడు.

*****

"థాంక్యూ ... థాంక్యూ విభ్రమా ... సెక్స్ అంటే కేవలం 'కొద్ది నిముషాల శరీరాల రాపిడి' అనే తప్పుడు అభిప్రాయాన్ని, ఓ అందమైన అనుభవం ద్వారా తొలగించావు. రెండు మనసుల మధ్య ఉద్వేగం వూపిరిపోసుకుని ఇంత అభుతంగా, విశ్వమంతా పరచుకుని, పిడికెడు గుండెలో నిలిచిపోతుందనుకోలేదు...'' విభ్రమ తలని తన గుండెలపై ఆన్చుకుని అన్నాడు.

స్టార్ హాస్పిటల్ లో ... అలా వాళ్ళ మొదటిరాత్రి జరిగింది.

*****

అర్థరాత్రి పన్నెండూ ముప్పయి. బాత్రూమ్ లో నుంచి 'అబ్బా' అన్న కేక, "బాబోయ్ ...'' అన్న మరోకేక వినిపించాయి కంటిన్యూగా. విభ్రమ కంగారుగా బాత్రూమ్ లోకి పరుగెత్తింది.

లోపల ...

షవర్ కింద జలకాలాట ఆడుతున్న మొగుడ్ని చూసి ఏదో అనబోయింది. అప్పటికే అతనామెని లాక్కోవడం, షవర్ కింద ఇద్దరూ జలకాలాడ్డం మొదలైంది. "అబ్బ ... బాత్రూమ్ లో ఈ అల్లరేమిటి?'' అన్న ఆమె పెదవిదాటాక ముందే, బాత్రూమ్ నె బెడ్రూంగా మార్చేశాడు. తన నైపుణ్యాన్ని చూపిస్తూ తనిష్క్. సన్నటి షవర్ జల్లులో తడుస్తూ తమ 'మలి' సమాగాన్ని జరుపుకున్నారు.

వేకువ ఝాము ... బద్ధకంగా వళ్ళు విరుచుకుని కళ్ళు తెరిచినా విభ్రమ కు భర్త కనిపించలేదు. కంగారుగా చుట్టూ చూసిన విభ్రమకు నేలమీద నిద్రపోతున్న భర్త కనిపించాడు. వెంటనే కంగారుగా అతడ్ని తట్టిలేపి "ఇక్కడ పడుకున్నారు ఏమిటండీ?'' అని అడిగింది.

"అర్థరాత్రి మద్దెల దరువని ... నన్ను మంచమ్మీద నుంచి తనని తగిలేసాక ... కింద పడ్డప్పుడు నా నడుం ముచ్చటగా మూడోసారి విరిగింది'' అంటూనే విభ్రమని మీదకి లాక్కున్నాడు.

షరా మామూలే ... తొలిరాత్రి దంపతుల మధ్య ముచ్చట ... మళ్ళీ మళ్ళీ చెప్పాలా? ముచ్చటా మూడవ సంగమం సంగతి.

*****

మార్నింగ్ డిశ్చార్జ్ అయి కారులో వెళ్తున్నారు. తనకు హెల్ప్ చేసిన స్టార్ హాస్పిటల్ డాక్టర్ మిత్రుడికి కృతజ్ఞతలు చెప్పి, ఇంటికి బయల్దేరాడు. "విభ్రమా ... ఈ విషయం బామ్మకు చెప్పకు. ఒకే రాత్రి ... మూడు రాత్రుల ముచ్చట్లు, మూడు పద్ధతుల్లో ... కదూ ...'' అన్నాడు కుడిచేత్తో స్టీరింగ్ కంట్రోల్ చేస్తూ ఎడమ చేత్తో విభ్రమని తన దగ్గరకు జరుపుకుంటూ ....