బెల్లం  ఆవకాయ

 

 

 

 

కావలసినవి:
మామిడికాయలు : 3
కారం : 200 గ్రాములు
ఉప్పు: 200 గ్రాములు
నూనె : 200 గ్రాములు
బెల్లం : అర కేజీ
ఆవపిండి : 100 గ్రాములు

 

తయారీ :
ముందుగా మామిడికాయలను శుభ్రంగా కడిగి, తుడిచి ముక్కలు తరిగి పెట్టుకోవాలి. తరువాత బెల్లం మెత్తగా కోరీ  అందులో కారం, ఆవపిండి, ఉప్పు, కప్పు నూనె వేసి ముక్కలను కలపాలి. తరువాత పాకం వచ్చేవరకు ముక్కలని రెండు మూడు రోజుల పాటు ఎండలో పెట్టాలి. పాకం వచ్చిన తరువాత మిగిలిన నూనెను పచ్చడిలో కలుపుకోవాలి.. అంతే బెల్లం ఆవకాయ రెడీ..