Dahi Vada (Ugadi Special)
Author : Teluguone
Preparation Time : 15M
Cooking Time : 10M
Yield : 2
4.0 Stars based on 291 : Reviews
Published On : March 17, 2018
Recipe Category : Others
Recipe Type : Break Fast
Total Time : 25M
Ingredient : Dahi Vada (Ugadi Special)
Description:

Dahi Vada (Ugadi Special)

Recipe of Dahi Vada (Ugadi Special)

Dahi Vada (Ugadi Special)

Directions | How to make  Dahi Vada (Ugadi Special)

 

 

దహి వడ (ఉగాది స్పెషల్)

 

కావలసినవి :-

పెసరపప్పు - 1కప్పు

మినపప్పు - 1కప్పు

పెరుగు -1/2 లీటరు

నూనె - వేయించడానికి సరిపడ

ఉప్పు - కొద్దిగా

తయారీ విధానం :-

పెసర, మినప పప్పులను కలిపి కడిగి 3గంటలు నానబెట్టాలి. మెత్తగా కాస్త గట్టిగా రుబ్బుకోవాలి. కాస్త ఉప్పు కలిపి బాగా చెంచాతో ఒకే దిశలో బాగా కలపాలి. నురగ తేలి పిండితేలిక పడుతుంది. ఈ పిండిని ఉండలుగా కాగే నూనెలో వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించుకుని ప్రక్కన పెట్టుకోవాలి. 

 

దహి వడ చట్నీలు :-

* కొత్తిమీర, పుదీనా, మిరపముక్కలు, అల్లం, జీలకర్ర, ఉప్పు కలిపి పుదీనా చట్నీ రుబ్బుకోవాలి.

 

తీపి చట్నీ:-

* చింతపండు రసం, బెల్లం, ఉప్పు, కారం, కిస్ మిస్ లు బాగా ఉడికించి తీపి చట్నీ తయారుచేసుకోవాలి.

 

దహి వడలు  (పునుగులు) గోరు వెచ్చని నీటిలో 10ని " తినేముందు వేసి చేతిలో ఒక్కసారి నీరు పోయేలా నొక్కి ఒక బౌల్ లో వేసుకోవాలి. పెరుగును గిలకొట్టి  పైన పోసి, ఆపైన పుదీనా చట్నీ, తీపి చట్నీవేసి జీలకర్ర పొడి కొత్తిమీరతో అలంకరించాలి. దీనిని చల్లగా సర్వ్ చేస్తే బావుంటుంది.  https://www.youtube.com/watch?v=PZwaNjjOAVo