Mutton Keema Pizza
Author : TeluguOne
Preparation Time : 10m
Cooking Time : 15m
Yield : 4
4.0 Stars based on 291 : Reviews
Published On : December 15, 2021
Recipe Category : Non-Vegetarian
Recipe Type : Starter
Total Time : 25m
Ingredient : Mutton Keema Pizza
Description:

Keema Pizza, a hearty, full of toppings and cheesy with a crust that you can sink your teeth into.  it’s the only thing you need for your next party!!

Recipe of Mutton Keema Pizza

Mutton Keema Pizza

Directions | How to make  Mutton Keema Pizza

 

కీమా పిజ్జా

 

 

కావలసిన పదార్థాలు:

కీమా - ఒక కప్పు

పిజ్జా బేస్ - రెండు

ఛీజ్ - 100 grms

నూనె - 1 టేబుల్ స్పూన్

షాజీరా - ½ టీ స్పూన్

ఉప్పు - ½ టేబుల్ స్పూన్

కారం - ½ టేబుల్ స్పూన్

ధనియాలపొడి - ½ టేబుల్ స్పూన్

అల్లం వెల్లుల్లి ముద్ద - 1 టేబుల్ స్పూన్

టమాటో కెచప్ - 2 టేబుల్ స్పూన్లు

 
తయారుచేసే విధానం:

ముందుగా కీమాలో కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం, కొంచెం అల్లం వెల్లులి ముద్ద వేసి, నీళ్ళు పోయకుండా ఉడికించి పక్కన పెట్టుకోవాలి.

తరువాత ఒక బాణలిలో నూనె వేసి, షాజీర, అల్లం వెల్లులి ముద్ద వేసి వేపాలి.అల్లం వెల్లులి ముద్ద కొద్దిగా వేగిన తరువాత ముందుగా ఉడకబెట్టిన కీమా వేసి మూత పెట్టి, కీమాలో నీళ్ళు ఇగిరిపోయేదాకా ఉడకపెట్టాలి.

కీమాలో నీళ్ళు మొత్తం ఇగిరిపోయాక మిగిలిన ఉప్పు, కారం, ధనియాలపొడి వేసి కలపాలి.కీమా బాగా వేగిన తరువాత తీసి పక్కన పెట్టాలి.

తరువాత పిజ్జా బేస్ తీసుకుని కత్తితో నాలుగు భాగాలుగా గాటు పెట్టుకోవాలి. దానిపైన టమాటో కెచప్ వేసి సమంగా పూయాలి. దీనిపైన కీమా వేసి సమంగా పరవాలి. దానిపైన ఛీజ్ తురుము వేయాలి.

ఇలా తయారు చేసిన పిజ్జాని ముందుగా వేడిచేసి పెట్టుకున్న ఓవెన్లో బేక్ చేసుకోవాలి. లేదా ఒక నాన్ స్టిక్ పాన్ లో పిజ్జాని పెట్టి దానిపై మూత పెట్టి స్టవ్ మీద సన్నని సెగతో పాన్ పిజ్జా చేసుకోవచ్చు.

ఛీజ్ కరిగి పిజ్జా లేత గోధుమ రంగులోకి వచ్చినప్పుడు బయటకు తీసి, దానిమీద చిల్లి ఫ్లేక్స్ గాని ఒరిగానో గాని చల్లి వేడివేడిగా వడ్డించాలి.