వాటర్ మిలన్ కూలర్

(సమ్మర్ స్పెషల్)

 

 

కావలసిన పదార్థాలు


పుచ్చకాయ ముక్కలు - నాలుగు కప్పులు
రోజ్ సిరప్ - నాలుగు చెంచాలు
రోజ్ వాటర్ - ఒక చెంచా
సబ్జా గింజలు - రెండు చెంచాలు
చక్కెర - రెండు చెంచాలు
మిరియాల పొడి - చిటికెడు
ఐస్ క్యూబ్స్ - పది

 

తయారీ విధానం...


సబ్జా గింజల్ని నీటిలో నానబెట్టాలి. అరగంట తర్వాత నీళ్లు ఒంపేసి పక్కన పెట్టాలి. పుచ్చకాయ ముక్కల్ని ఐస్ క్యూబ్స్ తో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఒకవేళ మరీ చిక్కగా అనిపిస్తే కాసిన్ని నీళ్లు పోసుకోవచ్చు. ఆ తరువాత దీనిలో రోజ్ సిరప్, రోజ్ వాటర్, చక్కెర వేసి బాగా కలపాలి. గ్లాసుల్లో అడుగున సబ్జా గింజలు వేసి, పైన ఈ డ్రింక్ ను పోయాలి. ఆ తరువాత మిరియాల పొడి చల్లి సర్వ్ చేయాలి.

--Sameera