వెర్మిసెల్లీ డేట్స్ మ్యాజిక్

 

 

కావలసిన పదార్థాలు:


వెర్రిసెల్లీ  - ఒక కప్పు

ఖర్జూరం - ముప్పావు కప్పు

చక్కెర - అరకప్పు

పాలు - అరకప్పు

వేడి నీళ్లు - రెండు కప్పులు

నెయ్యి  - రెండు చెంచాలు

 

తయారీ విధానం:

వేడి నీళ్లో చక్కెర వేసి కరిగే వరకూ పక్కన పెట్టండి. ఖర్జూరాలను గింజలు తీసేసి, సన్నగా పొడవుగా కోసి పెట్టుకోవాలి. స్టౌ మీద కడాయి పెట్టి ఒక చెంచా నెయ్యి వేయాలి. వేడెక్కాక వెర్మిసెల్లీని వేసి వేయించాలి. రంగు మారిన తరువాత చక్కెర నీటిని పోసి, ఖర్జూరం కూడా వేసి మూత పెట్టేయాలి. సన్నని మంటమీద పది నిమిషాల పాటు వేయించాక పాలు పోసి మళ్లీ మూత పెట్టాలి. రెండు మూడు నిమిషాలు అలా ఉడకనిచ్చాక మూత తీసేయాలి. చిక్కగా అయ్యేవరకూ సన్నని మంట మీద ఉడికించి, ఆపైన మిగిలిన నెయ్యి చల్లి దించేయాలి. కావాలంటే ఇందులో డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు.

 

- Sameera