వెజిటేబుల్  మసాలా గ్రేవీ

 

 

 

 కావలసినవి
కాలీఫ్లవర్‌ - ఒకటి
క్యారట్లు -  నాలుగు
బీన్స్ - 150 గ్రాములు
పచ్చి బఠాణీలు - అర కప్పు
అల్లం,- చిన్న ముక్క
వెలుల్లి - నాలుగు రెబ్బలు
పచ్చిమిరపకాయలు - నాలుగు
గరం మసాలా పొడి - ఒక స్పూన్
పసుపు - అర స్పూన్
జీడిపప్పు, బాదాం - రెండు స్పూన్లు
ఫ్రెష్ క్రీం -  ఒక స్పూన్
గసగసాలు - 1 స్పూన్‌
వెల్లుల్లి - నాలుగు రెబ్బలు
నువ్వులు - 50 గ్రాములు
జీడిపప్పులు, వేరుసెనగలు - రెండు స్పూన్లు
ఎండు మిరపకాయలు - రెండు
ఇలాచి - ౩
పెరుగు - 1 కప్పు
ఉప్పు - తగినంత
అల్లం పేస్ట్‌ - ఒకటిన్నర స్పూన్
ఉల్లిపాయలు - ౩
లవంగాలు - 4
నూనె - తగినంత
టొమాటోలు - 3
మిరియాలు - అర స్పూన్
జీలకర్ర- అర స్పూన్

 

తయారు చేసే విధానం
ముందుగా కూరగాయలను ముక్కలుగా  కట్ చేసి ఉడికించుకోవాలి. తరువాత కడాయి పెట్టి నూనె వేసి అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయల ముక్కలు వేసి వేయించాలి. ఇప్పుడు ఉడికించుకు న్న కూరగాయల ముక్కలు వేసి తరువాత గరం మసాలా  కొద్దిగా డ్రై ఫ్రూట్స్‌ వేసి ఉడికించాలి.

 

 

గ్రేవీ తయారీ :
డ్రై ఫ్రూట్స్‌ను మరిగిన నీళ్ళలో వేసి రెండు నిముషాలు ఉంచి తరువాత తీసి పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలను సన్నగా తరిగి నూనెలో వేయించి పేస్ట్ చేసుకోవాలి. తరువాత  టొమాటోలు కూడా కడిగి కట్ చేసి ఉడికించి పేస్ట్ చేసుకోవాలి. తరువాత పాన్ పెట్టి నూనె వేడి చేసి మసాలా దినుసులన్నింటిని  వేసి వేయించాలి. తరువాత వెల్లుల్లి, అల్లం పేస్ట్‌ వేసి  వేగాక వరుసగా ఉల్లిపాయ పేస్ట్, టొమాటో పేస్ట్ ,జీడిపప్పు పేస్ట్‌ వేసి కాసేపు ఉడికాక ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న కూరగాయ ముక్కల్లో  ఈ గ్రేవీ అంతా వేసి స్టవ్ పై పెట్టాలి  ఇప్పుడు ఇందులో పసుపు, గరం మసాలా పొడి, పెరుగు, ఉప్పు వేసి నూనె పైకి తేలే వరకు ఉడికించి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని పైన క్రీం వేసుకుని సర్వ్ చేసుకోవాలి.