వెజిటేబుల్ అండ్ ఓట్స్ సలాడ్

 


 

ఈ రోజుల్లో ఎవరినైనా బ్రేకఫాస్ట్ ఏం తిన్నారు అని అడిగితే....  అందరి నోట వినపడే కామన్ మాట ఓట్స్. ఎలాంటి రుచి లేనివి తినాలంటే కాస్త బోర్ కొడుతుంది కదా. కాస్త వెరైటిగా ఉండాలంటే ఓట్స్ తో ఏదో ఒక కొత్త రెసిపీని తయారుచేసి ఆ రుచిని ట్రై చేద్దామా.  


కావలసిన పదార్థాలు:


ఓట్స్ - 2 కప్పులు

సన్నగా తరిగిన పాలకూర - 1 కప్పు

బటన్ మష్రూమ్స్ - 1 కప్పు

సన్నగా పొడుగ్గా తరిగిన కేరెట్ - 1 కప్పు

నిమ్మరసం - 1/2 స్పూన్

మిరియాలపొడి - కొద్దిగా

చిల్లి సాస్ - 1/2 స్పూన్

ఉప్పు - తగినంత


తయారి విధానం:

 


 

పాలకూరని సన్నగా తరిగి పెట్టుకోవాలి. మష్రూమ్ కాడలు తీసేసి శుభ్రంగా కడిగి ఉంచుకోవాలి. స్టవ్ ఆన్ చేసి హైలో పెట్టి దాని మీద పేన్ పెట్టుకుని రెండు చెంచాలు నూనె వేసి అందులో ఓట్స్, కేరట్స్, మష్రూమ్స్ వేసి కాసేపు ఎర్రగా అయ్యేదాకా వేయించుకోవాలి. వాటిని తీసి ఒక బౌల్ లో ఉంచుకోవాలి. మళ్లీ పేన్ లో నూనె వేసి పాలకూరని పచ్చిపోయేలాగా వేగనివ్వాలి. దానిని ముందుగ తీసి ఉంచుకున్న ఓట్స్ మిశ్రమంలో వెయ్యాలి. ఇప్పుడు వాటన్నింటిని బాగా కలిపి అందులో నిమ్మరసం, మిరియాలపొడి, చిల్లి సాస్,ఆఖరుగా  కాస్తంత ఉప్పు వేసి కలపాలి. ఇలా తయారైన దాని మీద కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని హాయిగా ఆరగించటమే. ట్రై  చేసి చూడండి, బాగుంటే మీ ఫ్రెండ్స్ కి కూడా చెప్పండి.


                                                                                           .....కళ్యాణి