వేలెంటైన్స్ డే స్పెషల్ - మిల్క్ కేక్

 

 

వేలెంటైన్స్ డే అంటేనే ఒక తియ్యటి పండుగ. ఈ తీయటి పండుగ రోజున ఇష్టమైన వ్యక్తులతో కలసి తీయతీయని కబుర్లు చెప్పుకుంటూ, తీయతీయని అనుభూతులు పంచుకుంటూ అప్పుడే నోరు కూడా తీపి చేసుకుంటే ఎంత బాగుంటుందో కదా... అయితే దానికి మనం సొంతగా చేసుకున్న స్వీట్స్ అయితే ఇంకా బాగుంటుంది కదా.. అందుకే ఈ వేలెంటైన్స్ డే స్పెషల్ స్వీట్ మీకోసం...

 

కావలసిన పదార్థాలు:

బొంబాయి రవ్వ - ఒక కప్పు 
పాలు - ఒక గ్లాసు 
పంచదార - నాలుగు కప్పులు 
నెయ్యి - చిన్న కప్పు 
గుడ్లు - మూడు 
ఉప్పు - చిటికెడు 
వంట సోడా - ఒక స్పూను 
కేక్ పౌడర్ - కొద్దిగా 
జీడిపప్పు - ఐదు 
కిస్‌మిస్ - కొద్దిగా 
 

 

తయారుచేసే విధానం:

ముందుగా  గుడ్లను ఒక గిన్నెలో  తీసుకుని బాగా కలపాలి. ఈ మిశ్రమంలో పంచదార వేసుకోవాలి. తరువాత  పాలు, బొంబాయిరవ్వ, నెయ్యి  వేసి అన్నీ కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని  మీడియం మంట మీద ఉడికించుకోవాలి. పాకం వచ్చేవరకూ గరిటతో తిప్పుతూ వుండాలి. అలాగే కేక్ పౌడర్ కూడా వేసుకోవాలి. ఇలా స్వీట్ దగ్గరకు వచ్చేవరకూ వుంచి నెయ్యి పైకి తేలాక ఈ మిశ్రమాన్ని  నెయ్యి రాసిన ట్రేలోకి తీసుకోవాలి. చివరగా జీడిపప్పు, కిస్‌మిస్   వేసుకోవాలి. అంతే మిల్క్ కేక్ రెడీ. దీనిని కావలసిన సైజులో కట్ చేసుకోవచ్చు.