ఉగాది పచ్చడి

కావలసిన పదార్డాలు:
వేప పువ్వు-1కప్పు
బెల్లంపొడి-1కప్పు
శనగపప్పు 1కప్పు
కొత్తకారము-చిటెకెడు
ఉప్పు-అరస్పూను
చింతపండు- కొద్దిగా
కొద్దిగా చెరుకుముక్కలు
మామిడికాయ-1
కొబ్బరికోరు-1కప్పు
అరటి పండ్లు-6

తయారీ:

ముందుగా చింతపండులో నీళ్లు పోసి పులుసు తీయాలి. అరటిపండు తొక్కలు తీసి చిన్నముక్కలుగా కట్ చేసుకోవాలి. తరువాత మామిడికాయ తొక్కతీసి చిన్నముక్కలుగా తరగాలి. చింతపండు పులుసులో బెల్లం వేసి కరిగేవరకు కలపాలి. వేపపువ్వు తప్పించి మిగిలిన పదార్ధాలన్నీ వేసి బాగా కలపాలి. చివరిలో వేప పువ్వు వేసుకోవాలి..