ఉడిపి సాంబార్

 

 

 

కావలసినవి:
కందిపప్పు -ఒక కప్పు
క్యారట్ - రెండు
ఉల్లిపాయ -ఒకటి
బెల్లం తురుము - రెండు టీ స్పూన్లు
నూనె - 2 టేబుల్ స్పూన్లు
బంగాళదుంప - ఒకటి
ఉప్పు - తగినంత
చింతపండు -నిమ్మకాయంత
జీలకర్ర - అర  స్పూను
మినప్పప్పు - టీ స్పూను
ఎండుమిర్చి - 4
పచ్చి శనగపప్పు - రెండు టీ స్పూన్లు
ధనియాలు - టేబుల్ స్పూను
మిరియాలు - 6 గింజలు
కొబ్బరితురుము - అర కప్పు
ఆవాలు - అర టీ స్పూను
మినప్పప్పు - పావు టీ స్పూను
కరివేపాకు - రెండు రెమ్మలు
ఇంగువ - చిటికెడు
పచ్చిమిర్చి - 3
కొత్తిమీర - చిన్న కట్ట

 

 తయారి:
 ముందుగా కూరగాయ ముక్కలు , కందిపప్పును శుభ్రంగా కడిగి, తగినంత నీళ్ళు పోసి కుక్కర్‌లో ఉడికించాలి. తరువాత బాణలిలో టేబుల్ స్పూను నూనె వేసి కాగాక జీలకర్ర, మినప్పప్పు, పచ్చి శనగపప్పు, ఎండుమిర్చి, ధనియాలు, కొబ్బరి తురుము ఒక దాని తరవాత ఒకటి వేసి వేయించి, చల్లారాక మిక్సీలో కొద్దిగా  నీళ్ళు వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. తరువాత స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి చింతపండు రసం, ఉప్పు వేసి ఐదు నిముషాలు మరిగించాలి. తరువాత  మెత్తగా చేసుకున్న కందిపప్పు, ఉడికించుకున్న కూరముక్కలు, మసాలా పేస్ట్, బెల్లం తురుము, వేసి కలపాలి  తగినంత నీళ్ళు పోసి  పది నుంచి పదిహేను నిముషాలు మరిగించాలి. ఇప్పుడు పాన్‌పెట్టి అందులో నూనె వేసి కాగాక-పోపు దినుసులు వేసి పోపు చేసుకుని చివరిలో కొత్తిమిరతో గార్నిష్ చేసుకోవాలి