Home >>Vegetarian >>Tomato Batani


                             

టమాటా - బఠాణీ

 

 

కావలసినవి :

టమోటాలు        - పావుకిలో 

పచ్చిబఠాణీలు    - 100 గ్రా "

నూనె               - పెద్ద గరిటెడు 

ఉల్లిపాయలు      - 4 

పచ్చిమిర్చి        - 10

వెల్లుల్లి              - 4 రెబ్బలు 

పసుపు             - చిటికెడు 

కొత్తిమీర            - 2 చిన్నకట్టలు 

ఉప్పు, కారం        - తగినంత 

 

తయారుచేసే విధానం : 

 

* పచ్చి బఠాణీలను రాత్రి నానబెట్టి కూర వండే ముందు ఉడకబెట్టి వార్చుకోవాలి. టమోటాలు ముక్కలు కోసుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి చీలికలిగా తరగాలి.

*  గిన్నెలో  నూనెవేసి కాగాక వెల్లుల్లి వేసి తాలింపు పెట్టి ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసి ఎర్రగా వేపాలి. తరువాత టమోటా ముక్కలు బఠాణీలు వేసి ఒక్కసారి కల త్రిప్పి పసుపు, ఉప్పు, కారం వేసుకోవాలి. 

* మరోసారి కల త్రిప్పి మూత పెట్టాలి. టమోటా ఉడికాక కొత్తిమీర తరిగివేసి రెండు నిముషాలు ఉంచి దించాలి. 

Related Recipes