స్వీట్ కార్న్ హల్వా

 

 

స్వీట్ కార్న్ ని ఈ రోజుల్లో అందరు బాగా ఇష్టపడుతున్నారు. వాటిని ఆవిరిపై ఉడికించి వెన్న, మిరియాల పొడి, ఉప్పు వేసి తినటమే కాకుండా వాటితో స్వీట్ కూడా తయారుచేసుకోవచ్చు. ఈ రోజు స్వీట్ కార్న్ తో హల్వా ఎలా తయారుచెయ్యాలో చూద్దాం.


కావాల్సిన పదార్థాలు:

స్వీట్ కార్న్ - 1 కప్పు

బొంబాయి రవ్వ - 1 చెంచా

బెల్లం - 1/2 కప్పు

నెయ్యి - 3 చెంచాలు

యాలకుల పొడి - 1/2 చెంచా

జీడి పప్పు - 2 చెంచాలు

బాదం పప్పు - 1 చెంచా

ఫుడ్ కలర్ - చిటికెడు


తయారి విధానం:

స్వీట్ కార్న్ హల్వా కోసం ఒక మిక్సి లో స్వీట్ కార్న్ వేసి మరీ మెత్తటి పేస్ట్ లా కాకుండా కాస్త కార్న్ నలిగేలా ఆడుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో ఒక చెంచాడు నెయ్యి వేసి జీడిపప్పు, బాదం పప్పుని  వేయించి పక్కకి తీయాలి. అదే నేతిలో బొంబాయి రవ్వ వేసి ఎర్రగా వేయించాలి. అందులోనే స్వీట్ కార్న్ మిశ్రమాన్ని వేసి పచ్చిదనం పోయేదాకా వేయించుకోవాలి. అందులో బెల్లం వేసి  అది కరిగి మొత్తం మిశ్రమం దగ్గర పడ్డాకా అందులో యాలకుల పొడి మిగిలిన నెయ్యి వేసి స్టవ్ ఆపాలి. కావాలనుకునే వారు ఫుడ్ కలర్ వేసుకోవచ్చు. దానిని ఒక  బౌల్ లోకి తీసుకుని దాని మీద వేయించిన జీడిపప్పు, బాదం పప్పుని అలంకరించుకుంటే టేస్టీ టేస్టీగా ఉండే స్వీట్ కార్న్ హల్వా రెడీ.

- కళ్యాణి