స్వీట్‌కార్న్ హల్వా

 

 

కావలసిన పదార్థాలు
స్వీట్‌కార్న్‌  - 150 గ్రాములు,
నెయ్యి - రెండు టేబుల్‌ స్పూన్లు
యాలకుల పొడి - అర టీ స్పూన్‌
పంచదార - 100 గ్రాములు
జీడి పప్పు - 10
కిస్‌మిస్‌ - 10

 

 తయారుచేసే విధానం
ముందుగా కార్న్ మిక్సీ లో వేసి పేస్ట్ లా చేసి పెట్టుకోవాలి.తరువాత  స్టవ్ వెలిగించి  గిన్నె పెట్టి   నెయ్యి వేసి వేడి చేసి ముందుగా జీడిపప్పు, కిస్‌మిస్‌ వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్వీట్‌కార్న్‌ పేస్ట్‌ వేసి పది నిమిషాలు వేయించిన తరువాత   చక్కెర వేసి బాగా కలపాలి. అది దగ్గరగా అయ్యే వరకూ కలుపుతూ ఉండాలి. చివరలో యాలకుల పొడి వేసుకుని స్టవ్ అఫ్ చేసుకోవాలి. వేయించిన జీడిపప్పు, కిస్‌మిస్‌ కలిపిసర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి. అంతే హల్వా రెడీ.