స్టఫ్‌డ్‌ ఆలూ తందూరీ కర్రీ

 

 

కావలసినవి:
ఆలూ - పావుకేజీ
పన్నీర్ - 50 గ్రాములు
ధనియాలు - ఒక స్పూన్
చాట్ మసాలా - ఒక స్పూన్
జీలకర్ర పొడి - ఒక స్పూన్
ఇలాచీ పౌడర్ - ఒక స్పూన్
అల్లం, వెల్లుల్లి పేస్ట్ - రెండు స్పూన్లు
పెరుగు - అరా కప్పు
జీడిపప్పు - 10
కిస్‌మిస్ - 10
ఉప్పు : తగినంత
నూనె : తగినంత
కారం - సరిపడా

 

తయారీ:
ముందుగా ఆలూ మధ్యలో చిన్నహోల్ చేసి కట్ చేసిన ముక్కలు కూడా ఆయిల్ లో వేయించుకోవాలి. ఇలా వేయించిన ముక్కలను ఒక గిన్నెలోకి తీసుకొని పన్నీర్‌ని తురిమి అందులో వేసుకోవాలి. జీడిపప్పు, కిస్‌మిస్, చాట్‌మసాలా, ఉప్పు, ఇలాచీ పౌడర్‌లను కూడా వేసి బాగా కలిపి పెట్టాలి. దీన్ని హోల్  చేసుకొని వేయించుకున్న ఆలూ లో స్టఫ్ చేసుకోవాలి. మరో గిన్నెలో పెరుగు తీసుకొని అందులో అల్లం, వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర పొడి, కారం, చాట్‌మసాలా, నూనె వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని స్టఫ్ చేసుకున్న ఆలూ పై వేసుకుని వాటిని ఒక పాన్ లో పెట్టి స్టవ్ పై కుక్ చేసుకుని పైన చాట్ మసాలా వేసుకోవాలి.