స్పైసీ పొటాటో చిప్స్

 

 

కావలసిన పదార్థాలు:

బంగాళాదుంపలు                               - అరకిలో
పచ్చిమిర్చి ముక్కలు                         - అరకప్పు
అల్లం ముక్క                                      - చిన్నది
జీలకర్ర                                               - రెండు చెంచాలు
ఉప్పు                                                - తగినంత

తయారీ విధానం:

బంగాళాదుంపల్ని శుభ్రంగా కడిగి, చెక్కు తీయాలి. వీటిని గ్రేటర్ సహాయంతో చిప్స్ లా తరగాలి. అయితే మామూలు పొటాటో చిప్స్ లాగా మరీ పల్చగా ఉండకూడదు. కాస్త దళసరిగా ఉండేలా చూసుకోవాలి. పచ్చిమిర్చి అల్లం, జీలకర్రలను కలిపి మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి. ఓ గిన్నెలో నీళ్లు పోసి స్టౌ మీద పెట్టాలి.

నీళ్లు వేడెక్కాక ఉప్పు, పచ్చిమిర్చి పేస్ట్ వేసి కలపాలి. నీళ్లు తిరగబడుతున్నప్పుడు పొటాలో చిప్స్ ని వేయాలి. చిప్స్ ఉడికేవరకూ ఉంచి దించేయాలి. చిప్స్ ను నీటిలోంచి తీసి ఓ పల్చని బట్ట మీద పరచాలి. వీటిని రెండు మూడు రోజుల పాటు బాగా ఎండబెట్టాలి. తినాలనుకున్నప్పుడు నూనెలో వేయించుకోవడమే. గాలి చొరబడని కంటెయినర్ లో వేసి దాచిపెడితే ఇవి సంవత్సరం వరకూ నిల్వ ఉంటాయి.

- Sameera