సొరకాయ ఖీర్

 

 

కావలసినవి:

సొరకాయ : ఒకటి
మిల్క్‌మెయిడ్ : 400 గ్రాములు
బాదం,ఎండుద్రాక్ష,జీడిపప్పు : అర కప్పు
గ్రీన్ ఫుడ్‌ కలర్ : చిటికెడు   
పాలు :  లీటర్
నెయ్యి.. 500 గ్రాములు
బాస్మతి రైస్ :  100 గ్రాములు .
కార్న్‌ఫ్లోర్ : 100 గ్రాములు .
కోవా : పావు కేజీ
పంచదార : అర కేజీ

 

తయారు చేయు విధానం:
ముందుగా సొరకాయ తురుము తీసుకుని  కాస్త ఉడికించి పక్కన పెట్టుకోవాలి. తరువాత  బాస్మతి బియ్యాన్ని నెయ్యి వేసి  వేయించి  పిండి చేసుకుని పెట్టుకోవాలి . తరువాత  గిన్నెలో పాలు పోసి మరిగించాలి, ఇప్పుడు  బియ్యంపిండిలో  కొద్దిగా నీళ్ళు కలిపి పేస్టులా చేసి  మరుగుతున్న పాలల్లో  వేసి కలపాలి.  అలాగే కార్న్ ఫ్లోర్  కూడా పేస్టులా చేసి అందులో వేసుకోవాలి.ఇప్పుడు ఉడికించుకున్న సొరకాయ తురుము కూడా వేసుకోవాలి.ఒక ఐదు నిముషాలు ఆగి  పంచదార వేసి కరిగే వరకు కలపాలి.  పది నిముషాల తరువాత  కోవా , మిల్క్‌మెయిడ్, కలర్ ఒక్కొక్కటిగా వేసి బాగా  కలపాలి. ఖీర్ చిక్కబడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకుని మిశ్రమం బౌల్ లోకి తీసుకుని  వేయించిన  బాదం, ఎండుద్రాక్ష,జీడిపప్పలతో డెకరేట్ చేసుకుని గంటసేపు ఫ్రిజ్  లో ఉంచి చల్లగా సర్వ్ చేసుకోవాలి.