శనగపప్పు వడలు (దీపావళి స్పెషల్)

 


 

కావలసిన పదార్థాలు:-

 

పచ్చిశనగపప్పు - పావుకిలో 

నూనె - అరకిలో

ఉల్లిపాయలు - 4

పచ్చిమిర్చి - 6

జీలకర్ర - 2 టీ స్పూన్లు

ఉప్పు - తగినంత

 


తయారు చేసే పద్ధతి:-

 

నానబెట్టిన శనగపప్పును కడిగి ఉంచుకోవాలి. అందులోంచి ఒక గుప్పెడు పప్పు తీసి ఉంచి, మిగిలినదానికి తగినంత ఉప్పువేసి కొంచెం బరకగా రుబ్బుకోవాలి. దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుని, పక్కన ఉంచిన శనగపప్పు, జీలకర్ర కలపాలి. బాణలిలో నూనె కాగనిచ్చి, నిమ్మకాయంత ఉండలు చేసి, పాలిథిన్ కవర్ పై వడలు వత్తి, ఎర్రగా వేయించుకోవాలి. పిండిలో తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేస్తే, శనగపప్పు వడలు మరింత రుచిగా ఉంటాయి. నంజుకోడానికి అల్లప్పచ్చడి, కొబ్బరి పచ్చడి, శనగపప్పు, కొబ్బరి పచ్చడి ఏదైనా బాగుంటుంది.