రైస్ పరోటా

 

 

 

 

కావలసినవి:
గోధుమపిండి - నాలుగు కప్పులు
ఉల్లిపాయ - ఒకటి
పచ్చిమిర్చి - రెండు
కారం - ఒక స్పూన్
నూనె - కొద్దిగా
ఉప్పు - తగినంత
అన్నం - రెండు కప్పులు
కొత్తిమీర - కొద్దిగా

 

తయారీ:
ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి కొద్దిగా నూనె వేసి  రైస్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించి తరువాత ఉల్లి పాయ ముక్కలు, పచ్చిమిర్చి, కారం, కొత్తిమీర, ఉప్పు వేసి కొద్ది సేపు మగ్గాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత గోధుమపిండిలో ఉప్పు, సరిపడా నీళ్ళు పోసి చపాతీ పిండిలా కలిపి పెట్టుకుని అరగంట పిండిని నానపెట్టుకోవాలి. తరువాత  పిండిని ఉండలు చేసి మధ్యలో అన్నం మిశ్రమం పెట్టి  పరోటాలు చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి  వేడయ్యాక పరోటాలను నూనెతో కాల్చుకోవాలి.