పైనాపిల్ స్వీట్

 

 

కావలసినవి:
పైనాపిల్: రెండు కప్పుల ముక్కలు
నెయ్యి: తగినంత
కోవా: ఒక కప్పు 
పంచదార: రెండు కప్పులు 
యాలకుల పొడి: ఒక స్పూన్
జీడిపప్పు: అరకప్పు

 

తయారీ :
ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి కొద్దిగా నెయ్యి వేసి అందులో పైనాపిల్ ముక్కలను వేసి  పూర్తిగా నీరంత పోయేవరకూ వేయించాలి. అందులో పంచదారను కూడా వేసి బాగా కరిగేలా కలియబెడుతు తక్కువ మంట మీద ఉడికించాలి. ఇప్పుడు అందులోనే యాలకుల పొడి వేసి  కలపాలి. తర్వాత మరో పాన్ తీసుకొని అందులో మిగిలిన నెయ్యి వేసి  జీడిపప్పు వేసి గోల్డ్ కలర్ వచ్చే వరకూ వేయించి, పైనాపిల్ మిశ్రమంలో కలుపుకోవాలి. తరువాత  కోవా తురుము వేసి కలిపి ఒక పది నిముషాలు ఉడికించి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని ఫ్రిజ్ లో పెట్టి చల్లగా సర్వ్ చేసుకోవాలి....