పనీర్ పాన్ స్వీట్

 

 

 

కావలసినవి
పనీర్ - 1 కప్పు
బూడిద గుమ్మడికాయ - 500 గ్రాములు
కుంకుమ పువ్వు - చిటికెడు.
పటిక - చిన్న ముక్క
చక్కెర - 500 గ్రాములు
గ్రీన్ కలర్ - చిటికెడు
లవంగాలు - 10
యాలకుల పొడి - 1 టీ.స్పూన్
పిస్తా - 10

 

తయారీ

ముందుగా గుమ్మడికాయ చెక్కుతీసి, గింజలు తీసేసి పలుచగా స్లైసులుగా కట్ చేసుకుని ఫోర్కుతో అక్కడక్కడా గుచ్చాలి. ఒక పెద్ద గినె్నలో నీళ్లుపోసి అందులో పటిక వేసి కరిగిన తర్వాత ఈ గుమ్మడికాయ స్లైసులు వేసి రెండు గంటలు ఉంచాలి. తర్వాత తీసి బాగా కడగాలి. గిన్నెలో నీళ్లు పోసి గ్రీన్ కలర్ వేసి ఈ స్లైసులను అందులోకొద్దిసేపు ఉడికించి తీసేయాలి. ఇవి మరీ మెత్తగా ఉడికించకూడదు. తరువాత స్టవ్ వెలిగించి నీళ్ళు పోసి 400 గ్రాముల పంచదార వేసి తీగ పాకం చేసుకుని ఈ ముక్కలను అందులో వేసి ఉడికించాలి. ఇప్పుడు పనీరులో నిరు లేకుండా తీసేసి బాగా అందులో 100 గ్రాముల పంచదార వేసిచిన్న మంట మీద దగ్గరికి వచ్చే వరకు ఉడికించాలి. తరువాత యాలకుల పొడి, కుంకుమ పువ్వు, సన్నగా తరిగిన పిస్తా ముక్కలువేసి కలపాలి. పాకం నుండి గుమ్మడి స్లైసులను తీసి మధ్యలో కొద్దిగా పనీర్ మిశ్రమాన్ని పెట్టి నాలుగు వైపులనుండి తాంబూలం లా మడిచి విడిపోకుండా లవంగంతో గుచ్చాలి.