పన్నీర్ రోల్స్ రెసిపి

 

కావలసినవి :

మైదా పిండి - పావుకిలో

పన్నీర్ తురుము - ముప్పావు కప్పు

ఉల్లికాడల తురుము - పావు కప్పు

చిల్లీగార్లిక్ సాస్ - టేబుల్ స్పూన్

చీజ్ - పావుకప్పు

నూనె - 2 టీస్పూన్లు

ఉప్పు - సరిపడా


తయారుచేసే పద్ధతి :

  ముందుగా మైదాలో తగినన్ని నీళ్ళు, ఉప్పు వేసి పూరీ పిండిలా కలుపుకొని పది పురీల్లాగా చేసుకోవాలి.

 


తరువాత పాన్ లో నూనె వేసి ఉల్లికాడల తురుము వేసి వేగాక పన్నీర్ తురుము, చిల్లిగార్లిక్ సాస్,చీజ్ వేసి కలిపి రెండు నిముషాలు ఉడకనివ్వాలి.

 


ఇప్పుడు కలిపి ఉంచుకున్న పిండిని ఉండలుగా చేసుకుని  పూరీలా  చేసుకుని స్టఫ్ కూడపెట్టి రోల్స్ లా చుట్టి పెట్టుకోవాలి.ఇప్పుడు వీటన్నింటినీ ప్లేట్ లో పెట్టుకుని ఆయిల్ లో deep fry చేయాలి.