పన్నీర్‌ మలై కర్రీ

 

 

 

కావలసినవి :
పన్నీర్‌ - అరకేజి
ఉల్లిపాయలు -2
టమాట-2
గరంమసాలా - ఒక స్పూన్
ఉప్పు- తగినంత
కారం - రెండు స్పూన్స్
ధనియాలపొడి - ఒక స్పూన్
పసుపు - అర స్పూన్
క్రీమ్ - అరకప్పు
నూనె - సరిపడా
అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ - రెండు స్పూన్స్

 

తయారీ :
ముందుగా పాన్‌లో నూనె వేసి వేడయ్యాక ఉల్లిపాయ ముక్కల్ని వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. తరువాత అల్లం, వెల్లుల్లి పేస్ట్‌, కారం, ధనియాల పొడి, పసుపు, టమాట ముక్కలు ఉప్పు వేసి కలిపి కొద్దిసేపు వేయించాలి. ఇప్పుడు  పన్నీర్‌ ముక్కలు వేసి మసాలా బాగా పట్టేలా కలిపి ఐదు నిముషాలు వేయించి క్రీమ్ వేసి కలపాలి తరువాత గరం మసాలా వేసి కలిపి ఇంకో ఐదు నుంచి పది నిమిషాల పాటు ఉడికించి చివర్లో  కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసి చపాతితో కాని రైస్ తో కాని వేడి వేడి గా సర్వ్ చేసుకోవాలి....