పన్నీర్ చీజ్ బాల్స్

 

 

 

పన్నీరు ఆరోగ్యానికి చాలా మంచిది. దీనితో కర్రీస్ చేసుకుంటుంటా.. ఈ పన్నీర్ తో స్నాక్ ఐటమ్స్ కూడా తయారుచేసుకోవచ్చు. అందులో భాగంగానే ఇప్పుడు పన్నీరు చీజ్ బాల్స్ ఎలా తయారు చేయాలో ఓ లుక్కేద్దాం..

కావల్సిన పదార్థాలు:

* పనీర్ - 500 గ్రాములు
* చీజ్ - 1 కప్పు
* ఉల్లిపాయలు - 1 కప్పు
* పచ్చిమిర్చి - 4 to 5
* బ్రెడ్ పొడి - 1/2కప్పు
* బంగాళదుంపలు - 1/2 కప్పు
* కార్న్ ఫ్లోర్ - 1/2 క్పపు
* కారం - 1/2 స్పూన్
* ఉప్పు: రుచికి సరిపడా
* నూనె తగినంత

తయారుచేయు విధానం:

1. ముందుగా బౌల్ తీసుకొని అందులో ఉల్లిపాయలు, పనీర్ తురుము,  చీజ్ తురుము వేయాలి.
2. తర్వాత అందులోనే పచ్చిమిర్చి, బంగాళదుంప, కారం వేసి బాగా మిక్స్ చేయాలి.
3. అలాగే కార్న్ ఫ్లోర్ కూడా వేసి మొత్తం మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసి.. తరువాత చిన్న చిన్న బాల్స్ గా చేసుకొని పెట్టుకోవాలి.
4. ఆ తర్వాత, స్టౌ మీద పాన్ పెట్టి నూనె వేసి.. నూనె వేడి అయ్యాక పనీర్ చీజ్ బాల్స్ బ్రెడ్ పొడిలో పొర్లించి తర్వాత కాగే నూనెలో వేసి ఫ్రై చేసుకోవాలి.
5. డీప్ ఫ్రై చేసుకొన్న తర్వాత వీటిని ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి, . అంతే హాట్ హాట్ పనీర్ బాల్స్ రెడీ, వీటిని టమోటో సాస్ తో తింటే బావుంటుంది.