పనసపండు పాయసం

 

కావలసిన పదార్థాలు:

పనస తొనలు                                - పది
బ్రౌన్ రైస్                                       - ఒక కప్పు
పాలు                                           - ఒక కప్పు
చక్కెర                                          - ఎనిమిది చెంచాలు
యాలకుల పొడి                            - అరచెంచా
నెయ్యి                                          - మూడు చెంచాలు
జీడిపప్పు, బాదం పప్పు               - కావలసినన్ని

తయారీ విధానం:

బాదం పప్పును సన్నగా తరిగి పక్కన పెట్టాలి. పనస తొనల్లోని గింజలు తీసేసి ముక్కలుగా కోసుకోవాలి. వీటిని అరకప్పు నీళ్లలో వేసి స్టౌ మీద పెట్టాలి. బాగా ఉడికిన తరువాత దించేసుకుని పేస్ట్ చేసుకోవాలి. స్టౌ మీద కడాయి పెట్టి రెండు చెంచాల నెయ్యి వేయాలి. వేడెక్కాక జీడిపప్పును వేయించి తీసేయాలి. ఆ తరువాత బ్రౌన్ రైస్ ను వేసి కాసేపు వేయించాలి. తరువాత పాలు వేయాలి. పాలు మరిగి పొంగు వచ్చే వరకూ ఉడికించాక పనసపండు ప్యూరీ, చక్కెర, ఒక కప్పు నీళ్లు వేసి మూత పెట్టేయాలి. అప్పుడప్పుడూ కలుపుతూ సన్నని మంట మీద ఉడికించాలి. పాయసం బాగా ఉడికిపోయి దగ్గరగా అవుతున్నప్పుడు మిగిలిన నెయ్యి వేసి కలపాలి. రెండు క్షణాలు ఉంచి యాలకుల పొడి చల్లి దించేసుకోవాలి. జీడిపప్పు, బాదం వేసి సర్వ్ చేయాలి.

- Sameera