పాలకూర రైస్

 

 

కావలసినవి :
పాలకూర తరుగు 1- కప్పు
పుదీనా ఆకులు - ఒక కప్పు
అల్లం వెల్లుల్లి - ఒక టీ స్పూన్
దాల్చిన చెక్క - చిన్న ముక్క
షాజిర - 1 టీ.స్పూ.
యాలకులు - 4
లవంగాలు - 7
పచ్చిమిర్చి - 5
బియ్యం - అర కేజీ
ఉల్లిపాయ - 1
ఉప్పు - తగినంత
నూనె - సరిపడా

తయారీ :
ముందుగా పాలకూర కట్ చేసుకుని  వేడి నీళ్లలో వేసి చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు బియ్యం కడిగి పది నిమిషాలు నానబెట్టుకోవాలి. తరువాత స్టవ్ వెలిగించి ప్యాన్‌ పెట్టుకుని  నూనె వేడి చేసుకుని సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి  వేయించాలి. ఇందులో పాలకూర పేస్ట్, మసాలా దినుసులు, పుదీనా ఆకులు, అల్లం వెల్లుల్లి వేసి మరికొద్దిసేపు వేయించాలి. ఇప్పుడు  ఇందులో కడిగిన  బియ్యాన్నివేసి  తగినన్ని నీళ్లుపోసి సరిపడా ఉప్పువేసి ఉడికించాలి. రైస్ పూర్తిగా  మగ్గిన తరువాత సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని పుదీనాతో గార్నిష్ చేసుకోవాలి..