నూడుల్స్ సూప్

 

 

ఈ చల్లని వాతావరణంలో సూప్స్ చాలా బావుంటాయి. గత వారం దాల్ షోర్బా ఎలా చేసుకోవాలో నేర్చుకున్నాం కదా.. ఈసారి నూడుల్స్ సూప్ ఎలా  తయారు చేసుకోవాలో చూద్దాం..

కావలసిన పదార్ధాలు

* ఉడికించిన నూడుల్స్     - ఒక కప్పు

* కలీఫ్లవర్ తురుము        - అరకప్పు

* కొత్తిమీర తురుము         - టేబుల్ స్పూన్

* క్యారెట్ ముక్కలు           - పావుకప్పు

* టొమాటో ముక్కలు        - పావుకప్పు

* ఉల్లికాడలు తురుము     - 2 టేబుల్ స్పూన్లు

* వెజిటబుల్ స్టాక్              - 4 కప్పులు

* నూనె                             - రెండు స్పూన్లు

* ఉప్పు                              - తగినంత

తయారు చేసే విధానం:

* ముందుగా ఒక బాణలి తీసుకొని అందులో నూనె వేసి.. అది కాగాక కలీప్లవర్, క్యారెట్, కొత్తిమీర, ఉల్లికాడలు తురుము వేసి వేయించుకోవాలి.

* ఇప్పుడు మరో గిన్నెలో వెజిటబుల్ స్టాక్ పోసి వేయించిన కురగాయ ముక్కలు,  టొమాటో ముక్కలు వేసి మరి గించాలి.

* ఆఖరిగా ఉడికించిన నూడుల్స్ కూడా వేసి దించాలి. తగినంత ఉప్పు వేసి చిల్లీసాస్, చిల్లీ వినెగర్ లతో అందించాలి.