న్యూ ఇయర్ స్పెషల్ కేక్ 

 

 

కావాల్సిన పదార్థాలు :

వెన్న

పంచదార

కోడి గుడ్లు

నిమ్మ రసం

రమ్

బ్రాండీ

డ్రై ఫ్రూట్స్ 

బాదం

కాజు

వనీలా ఎసెన్స్ 

బ్రౌన్ షుగర్

 

తయారు చేయు విధానం :

* ఒక బౌల్ లో వెన్న, పంచదార, కోడి గుడ్డు సోన తీసుకోవాలి. అన్నీ సమాన పరిమాణంలో వుండాలి. తరువాత బాగా గిలకొట్టాలి. ఈ మిశ్రమంలో వీలైనన్ని ఎక్కువ డ్రై ఫ్రూట్స్ కలపాలి. అయితే, ముందుగా ఈ డ్రై ఫ్రూట్స్ ని రమ్ లో నానబెట్టాలి. మైదా పిండితో కలపాలి. తరువాత మెల్ల మెల్లగా వెన్న, పంచార, కోడి గుడ్డ సోన మిశ్రమానికి యాడ్ చేయాలి. ఆపైన బాదం, కాజు కూడా కలపాలి. కొద్దిగా రమ్, బ్రాండీలను కలపాలి. వనీలా ఎసెన్స్ కాస్తంత యాడ్ చేయాలి. నిమ్మ రసం కూడా కలపాలి. రంగు చక్కగా వచ్చేందుకు బ్రౌన్ షుగర్ కలపాలి. ఒకట్రెండు చెంచాల జామ్ సైతం కలపాలి.

* అన్నీ కలగలిపిన మిశ్రమాన్ని మౌల్డ్ లో వుంచాలి. తరువాత ఓవెన్ లో మూడు గంటల పాటూ వుంచాలి. ఓవెన్ ఉష్ణోగ్రత పూర్తిగా మినిమం రేంజ్లో వుండాలి. బయటకు తీసిన కేక్ పైన కొంచెం రమ్ చల్లాలి. దీంతో డెలీషియస్ న్యూ ఇయర్ కేక్ రెడీ!