న్యూఇయర్ స్పెషల్

 

 

 

యాపిల్‌ కేక్‌

 

 

కావలసినవి :
యాపిల్స్‌-మూడు,
బటర్‌కాగితం-ఒకటి
మైదా-రెండు కప్పులు
క్యాస్టర్‌ షుగర్‌-250 గ్రాములు
వెన్న- 100 గ్రాములు
గుడ్లు-రెండు
దాల్చిన చెక్కపొడి-రెండు స్పూన్లు
పాలు -అర లీటర్
బేకింగ్‌ పౌడర్ - ఒక స్పూన్
వంట సొడా - ఒక స్పూన్
గరంమసాలా- అర స్పూన్

 

తయారుచేసే విధానం :
ఓవెన్‌ను ముందుగా175 డిగ్రీల ఉష్ణోగ్రతలో వేడి చేసుకోవాలి. కేక్‌ ఉంచే పాత్రకు బటర్‌ కాగితాన్ని రాయాలి. మైదా, బేకింగ్‌పొడి, వంటసోడా, గరంమసాలా దాల్చిన చెక్కపొడులను విడివిడిగా జల్లించి పెట్టుకోవాలి. ఓ పాత్రలో క్యాస్టర్‌ షుగర్‌ వెన్న తీసుకుని బాగా గిలక్కొట్టాలి. ఇందులో కోడిగుడ్ల సొన చేర్చి ఆ తరువాత ముందుగా జల్లించిన పొడులు, సన్నగా తరిగిన యాపిల్‌ ముక్కల్ని కలపాలి. చివరగా పాలు చేర్చి కేక్‌ పాత్రలోకి తీసుకోవాలి. ఇప్పుడు ట్రేలో నీళ్లు పోసి నలభై నిమిషాల పాటు బేక్‌ చేయాలి. అంతే యాపిల్‌ కేక్‌ రెడీ

 

 

*******

 

పైనాపిల్ కేక్

 


కావలసిన పదార్థాలు :
పైనాపిల్ ముక్కలు - రెండు కప్పులు
ఆరెంజ్ తొక్కల రసం - 1 స్పూన్
బేకింగ్ సోడా    -  1 స్పూన్
తేనె             -    ముప్పావు కప్పు
బ్రౌన్ షుగర్   -  పావు కప్పు
మైదా          -  రెండు కప్పులు             
బేకింగ్ పౌడర్  -   1 స్పూన్
చీజ్             -   150 గ్రాములు
నిమ్మరసం     -   2 టేబుల్ స్పూన్లు

 

తయారుచేసే పద్ధతి :
 ముందుగా కొన్ని పైనాపిల్ ముక్కలు ఉంచి మిగిలిన ముక్కలను జ్యూస్ చేసి పెట్టుకోవాలి. మైదాలో బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, ఉప్పు కలపాలి. మరో గిన్నెలో నెయ్యి, తేనె, చీజ్, పైనాపిల్ జ్యూస్, నిమ్మరసం, ఆరెంజ్ తొక్కల తురుము వేసి గిలక్కొట్టాలి. ఈ గుడ్డు మిశ్రమం మొత్తాన్ని మైదా మిశ్రమం లో కలపాలి. కేక్ బాక్స్ లో అడుగున పైనాపిల్ ముక్కలు పేర్చాలి. దానిమీద జాగ్రత్తగా కేక్ మిశ్రమాన్ని వేయాలి. ఈ పాత్రని ఓవెన్ లో అరగంట బేక్ చేయాలి. కేక్ బ్రౌన్ కలర్ లో కి రాగానే ఓవెన్ లో నుండి బయటకి తీసేయ్యాలి. చల్లారిన తర్వాత కేక్ బాక్సును ప్లేటు మీద బోర్లించి ముక్కలు కట్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి.