Home >>Non-Vegetarian >>Mutton Soup

 


మటన్ సూప్

 

 

కావలసిన పదార్థాలు..

మటన్ మూలుగ ఎముకలు      - కిలో

బోన్ లెస్ మటన్                      - 200 గ్రా

పలావు ఆకులు                       - 2

ఉల్లిపాయలు                            - 2  

అల్లం వెల్లుల్లి                            - ఒక స్పూన్

నెయ్యి                                      - ౩ టేబుల్ స్పూన్లు

ఉప్పు                                        - రుచికి సరిపడా

కొత్తిమీర                                   - కట్ట

పుదీనా                                    - కట్ట

తయారుచేసే విధానం :

* ముందుగా మటన్ ఎముకల్ని మంచినీళ్ళతో శుభ్రంగా కడగాలి. వెడల్పాటి పాన్ లో 

* ఇప్పుడు బోన్ లెస్ మటన్ తీసుకొని శుభ్రంగా కడిగి ఆ ముక్కల్ని, ఎముకలు ముక్కలు, ఉప్పు, పలావు ఆకులు, పెద్ద ఉల్లిముక్కలు వేసి నాలుగు లీటర్ల నీళ్ళుపోసి అవి సగం అయ్యేవరకూ మరిగించాలి.

* అలా మరిగిన తరువాత.. వడగట్టి ముక్కల్ని బయటకు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసి సూప్ లో వేయాలి. ఆ తరువాత కొత్తిమీర, పుదీనా తురుము వేసి పది నిముషాలు మరిగించాలి.

* బాణలిలో నెయ్యి వేసి ఉల్లిముక్కలు, వెల్లుల్లి వేసి వేయించి సూప్ లో కలిపి మళ్ల్లీ ఐదు నిముషాలు మరిగించాలి. చివరగా కొత్తిమీరతో అలంకరించాలి.

Related Recipes