మష్రూమ్స్ క్యాప్సికం రైస్

 

 

 

కావలసినవి:

బాస్మతి రైస్ ( వండినది) -  రెండు కప్పులు

మష్రూమ్స్ -  200 గ్రాములు

క్యాప్సికం -   3

జీలకర్ర పొడి -   అరస్పూన్

దనియాల పొడి  - ఒక స్పూన్

గరం మసాల పొడి - ఒక స్పూన్

నెయ్యి - సరిపడా

ఉప్పు -  తగినంత

పచ్చి మిర్చి -  నాలుగు

జీడిపప్పు -   పది

లవంగాలు - 4

 

తయారీ:

ముందుగా  స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని  నెయ్యి  వెసుకొని  లవంగాలు, జీడిపప్పు వేయించుకున్న తరువాత అందులో క్యాప్సికం ముక్కలును, పచ్చి మిర్చి ముక్కలను వేసి, కొంచం ఉప్పు వేసి, మగ్గనివాలి, తరువాత  మష్రూమ్స్ ముక్కలను కుడా వేసి మగ్గనివాలి. ఇప్పుడు జీలకర్ర పొడి, దనియాల పొడి వేసి కొంచం వెగనిచ్చి  అందులో రైస్  వేసి బాగా కలిపి ఐదు నిముషాలు మగ్గనివ్వాలి.  తరువాత గరం మసాల వేసుకొని కలిపి వేడి వేడిగా సర్వ్ చేసుకోవాలి...