మసాలా ఆలూ ఫ్రై

 

 

 

ఎప్పుడు రోటీన్ గా ఆలూ తో ఫ్రై మాత్రమే చేసుకునే వారికోసం ఈ మసాలా ఆలూ ఫ్రైనీ పరిచయం చేస్తున్నాం. ఇది సాంబార్ తో కానీ, పప్పుకి కానీ  సైడ్ డిష్ గా చాలా  బావుంటుంది...

 

కావలసినవి :
బంగాళా దుంపలు - పావు కేజీ
వెల్లుల్లి - 4 రేకలు
అల్లం- చిన్నముక్క
పచ్చి కొబ్బరి - చిన్నముక్క
నూనె - తగినంత
ధనియాలు -1 టీ స్పూను
జీలకర్ర - అర టీ స్పూను
కొత్తిమీర - కొద్దిగా
పచ్చి మిర్చి - 5
ఉప్పు - ఒక స్పూను
కారం - సరిపడా

 

తయారు చేసే పధ్ధతి :

 

ముందుగా బంగాళా దుంపలను ఉడికించి చల్లరాకా పొట్టు తీసేసి కట్ చేసి పక్కన  పెట్టుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లి, అల్లం,జీలకర్ర, పచ్చికొబ్బరి, ధనియాలు అన్నిటిని కలిపి పేస్ట్ లా చేసుకోవాలి.ఆ పేస్ట్ లోనే ఉప్పు, కారం కూడా కలిపి  కట్  చేసుకున్నబంగాళా దుంప ముక్కలకు పట్టించాలి. తరువాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని ఆయిల్ వేసి కాగాక అందులో  దుంప ముక్కలను వేసుకుని ఒక పది నిముషాలు ఉడకనివ్వాలి.  ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్ తీసుకుని అందులో ఫ్రై వేసుకుని చివరగా కొత్తిమిర తో గార్నిష్ చేసుకోవాలి...