మ్యాంగో షర్బత్

 

 

 

కావలసిన పదార్థాలు:

మామిడిపండు ముక్కలు - రెండు కప్పులు

సబ్జా గింజలు - రెండు చెంచాలు

చక్కెర - మూడు చెంచాలు

నీళ్లు - నాలుగు కప్పులు

నిమ్మరసం - ఒక చెంచా

 

తయారీ విధానం:

సబ్జా గింజల్ని అరగంట పాటు నానబెట్టాలి. మామిడి ముక్కల్ని నీళ్లు, చక్కెరతో కలిపి మెత్తని ప్యూరీలా చేసుకోవాలి. తరువాత ఈ ప్యూరీని ఓ బౌల్ లో వేసుకోవాలి. ఇందులో సబ్జా గింజలు వేసి బాగా కలపాలి. చివరగా నిమ్మరసం పిండి, గ్లాసుల్లో పోసి, ఐస్ క్యూబ్స్ వేసి అందించాలి.

- Sameera