మ్యాంగో షీరా

 

 

కావలసిన పదార్థాలు:

మామిడిపండు గుజ్జు - ఒక కప్పు

బొంబాయి రవ్వ - ఒక కప్పు

నీళ్లు - ఒకటిన్నర కప్పు

పాలు - ఒకటిన్నర కప్పు

చక్కెర - ముప్పావు కప్పు

నెయ్యి - పావుకప్పు

యాలకుల పొడి - ఒక చెంచా

జీడిపప్పు, బాదంపప్పు - కావలసినన్ని


తయారీ విధానం:

స్టౌ మీద కడాయి పెట్టి రెండు చెంచాల నెయ్యి వేయాలి. వేడెక్కిన తరువాత జీడిపప్పు, బాదంపప్పులను వేసి, వేయించి తీసేయాలి. ఆ తరువాత అదే కడాయిలో బొంబాయి రవ్వ వేసి పచ్చి వాసన పోయేదాకా వేయించి తీసేయాలి. ఓ గిన్నెలో, పాలు నీళ్లు వేసి స్టౌ మీద పెట్టాలి. మరిగిన తర్వాత బొంబాయి రవ్వ వేయాలి. రవ్వ ఉడికి మెత్తబడిన తరువాత చక్కెర వేయాలి. చక్కెర కరిగిన తరువాత మామిడిపండు గుజ్జు వేయాలి. బాగా కలుపుతూ సన్నని మంట మీద ఉడికించాలి. మిశ్రమం దగ్గరగా అయ్యిన తరువాత నెయ్యి వేసి కలపాలి. ఓ క్షణం పాటు ఉంచి యాలకుల పొడి, జీడిపప్పు, బాదంపప్పు వేసి దించేయాలి.

- Sameera