పచ్చిమామిడి రైస్

 

 

కావలసిన పదార్థాలు:

పచ్చి మామిడికాయ - ఒకటి

అన్నం - మూడు కప్పులు

పచ్చిమిర్చి - నాలుగు

కారం - రెండు చెంచాలు

పసుపు - చిటికెడు

ఉప్పు - తగినంత

ఇంగువ - అరచెంచా

నూనె - రెండు చెంచాలు

వేరుశనగలు - మూడు చెంచాలు

ఆవాలు - ఒక చెంచా

కరివేపాకు - ఒక రెమ్మ

కొత్తిమీర - పావుకప్పు

 

తయారీ విధానం:

మామిడిపండు తొక్క తీసి సన్నగా తురుముకోవాలి. పచ్చిమిర్చిని ముక్కలుగా కోసుకోవాలి. స్టౌమీద కడాయి పెట్టి నూనె వేయాలి. వేడక్కాక వేరుశనగల్ని వేయించి తీసేయాలి. అదే కడాయిలో ఆవాలు, కరివేపాకు వేయాలి. చిటపటలాడాక పచ్చిమిర్చి వేయాలి. ఓ నిమిషంపాటు వేయించాక ఇంగువ వేయాలి. తరువాత మామిడి తురుము కూడా వేసి రెండు నిమిషాల పాటు వేయించాలి. తరువాత ఉప్పు, పసుపు వేసి కలిపి పచ్చివాసన పోయేవరకూ వేయించాలి. ఆపైన అన్నం వేసి బాగా కలపాలి. మామిడి మిశ్రమం అన్నానికి బాగా అంటేలా కలుపుతూ రెండు నిమిషాలు వేయించాక దించేయాలి. దీనిలో వేరుశనగలు వేసి కలిపి, కొత్తిమీర చల్లి వడ్డించాలి.

- Sameera