మ్యాంగో కుల్ఫీ

 

 

కావలసినవి:
బాగా పండిన మామిడి గుజ్జు - మూడు కప్పులు
యాలకుల పొడి - అర స్పూన్
బియ్యంపిండి - రెండు స్పూన్లు
కుంకుమ పువ్వు - కొద్దిగా
బాదం పేస్ట్ - నాలుగు  స్పూన్లు
పాలు - మూడు కప్పులు
చక్కెర - ఒక కప్పు

 

తయారీ:
ముందుగా పాలల్లో కుంకుమ పువ్వు, చక్కెర వేసి బాగా మరగబెట్టాలి. పాలు చిక్కబడ్డాక బియ్యంపిండి వేసి సన్నని మంట మీద మరికాసేపు కాగనివ్వాలి. పాలు చిక్కబడేంత వరకు అలాగే ఉంచాలి. ఇప్పుడు బాదంపేస్ట్, మామిడిపండ్ల గుజ్జు, యాలకుల పొడి వేసి సన్నని మంట మీద పది నిమిషాలు ఉడకనివ్వాలి. ఈ మిశ్రమాన్ని కుల్ఫీ మౌల్ద్ లో పోసి ఆరు గంటలు డీప్ ఫ్రిజ్‌లో పెట్టాలి. ఆ తరువాత కుల్ఫీని బయటకు తీసి సర్వ్ చేసుకోవాలి...