మ్యాంగో బర్ఫీ

 

 

కావలసినవి:
మామిడిపండు గుజ్జు : రెండు కప్పులు
జీడిపప్పు : పది
కోవా: రెండు కప్పులు
ఇలాచి పొడి : అరా స్పూన్
బాదం పప్పు : ఐదు
పంచదార పొడి : రెండు కప్పులు
కిస్మిస్‌ : పది

 

తయారీ :
ముందుగా మామిడి పండు గుజ్జును కొంచం మందంగా ఉన్న గిన్నెలోకి తీసుకుని అందులో  పంచదారను కలిపి స్టవ్ పై పెట్టి ఉడికించాలి. తరువాత  మరో గిన్నెతీసుకుని సన్నని సెగపైన కోవా వేసి బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించాలి. ఇప్పుడు  మామిడిపండు గుజ్జు, ఇలాచి పొడి కోవాలో వేసి  బాగా కలపాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దానికి నెయ్యి రాసి అందులోచల్లారిన మిశ్రమాన్ని వేసి సమానంగా పరిచి  ముక్కలుగా కట్‌ చేసుకొని బాదం పప్పు, జీడిపప్పు, కిస్‌మిస్‌లతో డెకరేట్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి