మామిడికాయ మసాలా కర్రీ

 

 

కావలసినవి:

మామిడికాయలు - రెండు

కారం - రెండున్నర స్పూన్లు

బియ్యం ఒక స్పూను

ధనియాలు - రెండు స్పూన్లు

ఆవాలు - అర స్పూన్

తెల్లనువ్వులు - ఒకస్పూను

కొత్తిమీర కొద్దిగా

ఉప్పు తగినంత

వెల్లుల్లి రెబ్బలు - ఐదు

ఎండుమిర్చి - నాలుగు

కరివేపాకు రెండు రెమ్మలు

మినప్పప్పు- రెండు స్పూన్లు

మెంతులు - అర స్పూన్

ఆయిల్  - సరిపడా

 

తయారీ :

ముందుగా మసాలా కోసం ధనియాలు, ఆవాలు, ఎండు మిర్చి, నువ్వులు బియ్యం, మెంతులుఅన్నిటిని గ్రైండ్ చేసుకోవాలి. తరువాత మామిడికాయలు కడిగి ముక్కలు కట్ చేసుకోవాలి.ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె పోసి  వెల్లుల్లి, కరివేపాకు, ఆవాలు, ఎండుమిర్చితో పోపు పెట్టి, అందులో మామిడికాయ ముక్కలు వేసి గరిటెతో కలపాలి. తరువాత   మసాలా పొడి, కారం,  కొద్దిగా మంచినీళ్లు వేసి, పది నిముషాలు  ఉడికించాలి . తరువాత స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి.....