మాల్ పూరీ స్వీట్

 

 

కావలసిన వస్తువులు:
బొంబాయి రవ్వ - 200 గ్రాములు
బేకింగ్ పౌడర్ - అర స్పూను
ఉప్పు - అర స్పూను
చక్కెర - 500గ్రా.
కుంకుమపువ్వు - అర స్పూన్
జీడిపప్పు - అర కప్పు
మైదాపిండి - 50 గ్రాములు
పాలు - అర లీటర్
యాలకులు - 4
నెయ్యి - 100 గ్రాములు

 

తయారు చేసే విధానం:
ముందుగా ఒక గిన్నెతీసుకుని అందులో బొంబాయి రవ్వ, మైదాపిండిని తీసుకుని దానిలో ఉప్పు, పాలు వేసి కలిపి పల్చనీ  పిండిలా తయారుచేసి మూతపెట్టి మూడు గంటలు పక్కన పెట్టుకోవాలి. తరువాత   స్టవ్ వెలిగించి   పాన్ పెట్టుకుని  నానపెట్టుకున్న పిండిని  కొంచం  మందంగా దోసలా  పోసి రెండువైపులా నేతితో  కాల్చాలి. ఇప్పుడు   ఒక గిన్నెలో  సరిపడా  నీళ్ళు పోసి ,చక్కెర వేసి స్టవ్ పై పెట్టి లేతపాకం వచ్చాకా అందులో కుంకుమపువ్వు, ఇలాచి పొడి, సన్నగా  కట్ చేసుకున్న  జీడిపప్పు వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత దోసలా  వేసుకున్న మాల్‌ పూరీలను పాకంలో వేసి 10 నిమిషాలు నానబెట్టి వెంటనే సర్వ్ చేసుకోవాలి .