కోవా బాదాం హల్వా

 

 

కావలసినపదార్థాలు:
బొంబాయిరవ్వ - ఒక కప్పు
పంచదార -ఒక కప్పు
బాదం- అర కప్పు
కోవా -పావుకప్పు
కేసరి-కొద్దిగా
నెయ్యి -పావుకప్పు

 

తయారీ :
ముందుగా రవ్వను నెయ్యిలో వేయించి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి సరిపడా నీళ్ళు పోసి
మరిగాక అందులోరవ్వ వేసి ఉండలు  కట్టకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. రవ్వ ఉడుకుతున్నపుడు అందులోపంచదార,నీళ్ళలోకలిపిన కేసరి,బాదం పలుకులు వేసి కలపాలి. పంచదార పూర్తిగా కరిగిపోయాక కోవాను వేసి కలిపి రెండు నిముషాలు ఉడికించి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని ఫ్రిజ్ లో పెట్టుకుని సర్వ్ చేసుకోవాలి.