కోవా కొబ్బరి లడ్డు

 

 

కావలసినవి: 
పాలపొడి - 200 గ్రాములు
కండెన్స్‌డ్ మిల్క్ - 250 గ్రాములు
నెయ్యి - 100 గ్రాములు
కొబ్బరి తురుము - కప్పు
పంచదార - 250 
బాదం, జీడిపప్పు , కిస్‌మిస్ - అర కప్పు

 

తయారీ విధానం:
ముందుగా ఒక గిన్నెతీసుకుని కొబ్బరి తురుము, పంచదార కలిపి, కొద్దిగా నీళ్ళు పోసి స్టౌ మీద పెట్టి, గరిటెతో కలుపుతూ ఉండాలి. పది నిముషాలకి మిశ్రమం గట్టిపడుతుంది. ఇందులో వేయించుకుని  చిన్నగా  కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి కలపాలి . ఇప్పుడు వేరొక గిన్నె తీసుకుని అందులో  పాల పొడి, కరిగించుకున్న నెయ్యి, కండెన్స్‌డ్ మిల్క్ వేసి కలిపాలి. దాన్ని చిన్న మంటమీద పెట్టి మిశ్రమం గట్టి పడేవరకు కలిపి కోవా  ముద్దలా తయారు చేసుకోవాలి. ఆ మిశ్రమం చల్లారాక చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి.  వాటిని చపాతీలా ఒత్తి అందులో  కొబ్బరి మిశ్రమాన్ని ఉండలు చేసి కోవాలో పెట్టి మళ్ళీ ఉండలా  చుట్టుకోవాలి. అంతే టేస్టీ కోవా  కొబ్బరి లడ్డులు రెడీ.