కొట్టంగి బుట్టలు

 

 

కావలసిన పదార్ధాలు:-
పనస ఆకులు - 12
మినప్పిండి - అరకిలో 

బియ్యం రవ్య -1 1/2 గ్లాస్
ఉప్పు -తగినంత
ఇడ్లీపాత్ర 

 

తయారీ విధానం:-

 ముందుగా మినప్పిండి అంటే 1 గ్లాస్ మినప్పప్పు నానబెట్టి రుబ్బుకుని..  1 1/2 గ్లాస్ బియ్యం రవ్య కలుపుకుని 4గంటలు నానబెట్టుకోవాలి. అందులో కొద్దిగా ఉప్పు కలుపుకుంటే ఈ బుట్టలకు కావలసిన పిండి సిద్ధం అయినట్లే. కొందరు ఇడ్లీ పిండిని కూడా వాడతారు... " ఈ మినప రొట్టె పిండి అంటే బియ్యంరవ్య కలిపిన పిండినే పండగల్లో సాంప్రదాయవంటలకి వాడతారు.

ఇప్పుడు పనసఆకులను శుభ్రపరచి ఎండలో 10 ని" ఉంచితే ఆ వేడికి మెత్తబడతాయి. వాటిని బుట్టలగా కుట్టాలి. వీలు కాకపోతే గ్లాసులో నాలుగు వైపులా ఈ ఆకులను చక్కగా అమర్చి... ఆ  ఆకుల మధ్యలో ఈ పిండిని వేసి ఈ బుట్టలను ఇడ్లీపాత్ర గిన్నెలో 10 నుచి 15 ని" ఆవిరిపై ఉడికించుకుని మెల్లగా చల్లారాక... ఆకులను తీసివెయ్యాలి. పనసఆకుల ఆవిరితో ఉడికించిన ఈ ఇడ్లీలు ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిని నైవేద్యంగా సమర్పించి చట్నితో తింటే చాలా రుచిగా ఉంటాయి. ఆకులలో పిండి వేసే ముందు ఇడ్లీ రేకులకు వేసినట్లు నూనె వేసి వేళ్ళతో చక్కగా చుట్టు అంటేలారాసి అప్పుడు పిండి వేస్తే చక్కగా ఉడికిన తరువాత అంటు కోకుండా బయటకి వస్తాయి. "పత్రితో పూజించే గణపయ్యకు ఈ పత్రాలతో వండిన నైవేద్యం సమర్పించి ఆయన ఆశీస్సులు పొందుదాం... జై ...జై  గణేశా....!!