Arikela Pulao

 

 

 

కావలసినవి:  

అరికల బియ్యం – ఒక కప్పు, 
నిలువుగా తరిగిన పచ్చి మిర్చి – 4
కూరగాయ ముక్కలు (క్యారట్, బఠాణీ, బీన్స్, క్యాప్సికమ్‌) – ఒక కప్పు 
ఉల్లి తరుగు – ఒక కప్పు
షాజీరా – అర టీ స్పూను
అల్లం వెల్లుల్లి ముద్ద – 2 టీ స్పూన్లు
ధనియాల పొడి – ఒక టీ స్పూను
నెయ్యి లేదా నూనె –  2 టేబుల్‌ స్పూన్లు
నిమ్మ రసం – ఒక టీ స్పూను
షాజీరా – అర టీ స్పూను
ఉప్పు – తగినంత
బిర్యానీ ఆకులు – 2
బిర్యానీ మసాలా దినుసులు
మిరియాలు – అర టీ స్పూను
పుదీనా తరుగు – పావు కప్పు
లవంగాలు – 4
ఏలకులు – 2
దాల్చిన చెక్క – చిన్న ముక్క
జాపత్రి – కొద్దిగా
సోంపు – అర టీ స్పూను

 

తయారుచేసే విధానం:

అరికల బియ్యాన్ని రెండుమూడు సార్లు కడిగి, తగినన్ని నీళ్లు జత చేసి రెండు గంటలపాటు నానబెట్టుకోవాలి. బిర్యానీ మసాలా దినుసులన్నీ రెండున్నర కప్పుల నీళ్లలో మరిగించి, వడకట్టి పక్కన ఉంచాలి. స్టౌ మీద మందపాటి గిన్నెలో నెయ్యి లేదా నూనె పోసి వేడి అయిన తరవాత షాజీరా, పచ్చి మిర్చి తరుగు, ఉల్లి తరుగు, కూరగాయ ముక్కలు ఒకదాని తరవాత ఒకటి వేస్తూ దోరగా వేయించుకోవాలి. పుదీనా, అల్లం వెల్లుల్లి ముద్ద చేర్చుకుని పచ్చి వాసన పోయేవరకు కలియబెట్టాలి. వడకట్టుకున్న నీళ్లు, ఉప్పు జత చేసి మరగనివ్వాలి. నానబెట్టుకున్న అరికల బియ్యంలో నీళ్లు ఒంపేసి, అరికలను మరుగుతున్న నీటిలో వేసి మూతపెట్టి, సన్నటి మంట మీద పులావు వండుకోవాలి. మధ్యలో ఒకటిరెండుసార్లు గరిటñ తో కలిపి మూత ఉంచి ఉడికించాలి. దించే ముందు ధనియాల పొడి, నిమ్మ రసం, నెయ్యి వేసి పూర్తిగా కలియబెట్టి దింపేయాలి. పుదీనా చల్లి, వేడివేడిగా అందించాలి.