ఖర్జూర లడ్డు

 

 

కావాలసిన పదార్ధాలు..

ఖర్జూరాలు - 100 గ్రా

నువ్వులు - అరకప్పు

వేరు శెనగలు - అరకప్పు

తేనె - చెంచా

 

తయారీ విధానం..

* ముందుగా ఖర్జూరాలు తీసుకొని..వాటిలోని గింజలు తీసేసి మిక్సీలో మెత్తగా చేసుకోవాలి.

* తరువాత వేరు శెనగలు, నువ్వులు పొడిచేసుకోవాలి.

* ఇప్పుడు ఒక గిన్నెలో ఖర్జూరాలు తీసుకొని  అందులో వేరు శెనగలు, నువ్వులు పొడి వేసి మెత్తగా కలుపుకోవాలి.

* చివరిగా కొంచెం తేనె వేసి చిన్న చిన్న ఉండల్లా చుట్టుకోవాలి. అంతే ఖర్జూర లడ్డూలు రెడీ అయినట్టే.

* ఇవి వారం రోజుల వరకు నిల్వ ఉంటాయి.