కంది పచ్చడి

 

 

 

కావలసినవి:
కందిపప్పు - 1 కప్పు
మిరపకాయలు - 8
ఉప్పు - కొంచెం
జీలకర్ర - కొంచెం
వెల్లుల్లి - 4 రెబ్బలు

 

తయారు చేసే విధానం:
కందిపప్పును దోరగా వేయించి పెట్టుకోవాలి. అందులో మిరపకాయలు, ఉప్పు, జీలకర్ర, వెల్లుల్లి వేసి మిక్సీలో వేసి, కొద్దిగా నీళ్ళు పోసి మెత్తగా పచ్చడి చేసుకోవాలి. అంతే.. కమ్మటి కంది పచ్చడి రెడీ. ఈ పచ్చడికి పోపు అవసరం లేదు. నూనె అవసరం లేదు.