కంది పచ్చడి

 

 

కావలసిన పదార్ధాలు :-

కందిపప్పు - 1 కప్పు

జీలకర్ర - 1 చెంచా

చింతపండు - కొద్దిగా

వెల్లుల్లిపాయలు - 5 నుంచి 6

ఎండు మిరపకాయలు - 4 నుంచి 5

ఉప్పు - 1 చెంచా

మినప్పప్పు - 1 /4 చెంచా

శెనగప్పపు - 1 /4 చెంచా

పసుపు - చిటికెడు

ఆవాలు - 1 /4 చెంచా

కరివేపాకు - 8 to 10 ఆకులు

ఇంగువ - కొద్దిగా

నూనె - తగినంత

 

తయారీవిధానం:-

కందిపప్పు తక్కువ మంట మీద మెల్లగా దోరగా వేయించుకోవాలి. పూర్తిగా వేగినతరువాత అదే వేడి మూకుడులో ముక్కలుగా తుంచిన ఎండుమిరప, జీలకర్ర వేసి కలిపి కొద్దిగా చల్లారిన తరువాత.. మిక్సీలో పసుపు ఉప్పు వేసి తిప్పాలి. ఇష్టమైన వారు ఆ వేడి మూకుడులో వెల్లుల్లి రెబ్బలు వేసి అవికూడా రుబ్బాలి.. చింతపండు నానబెట్టి రసం తీసుకుని.. ఆపచ్చడిలో వేసి కొద్దినీరు పోసి గట్టిగానే కలుపుతూ రుబ్బాలి. మరీ మెత్తగా కాకుండా ఈ పచ్చడిని రుబ్బాలి. రోలు ఉంటే అందులో రుబ్బితే మరీరుచిగా ఉంటుంది. బాణలి వేడి చేసి.. నూనె పోసి మినప్పప్పు, శెనగపప్పు ఆవాలు, ఇంగువ వెలుల్లి, కరివేపాకు వేసి దోరగావేగనిచ్చి ఈ పచ్చడి పైన పోపు వెయ్యాలి. వేడివేడి అన్నంలో ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది.

- భారతి