Home >>Others >>Kachori Chaat

 

 

కచోరి చాట్

 


కావలసినవి:

కచోరిలు - రెండు
చాట్‌ మసాలా -   ఒకటిన్నర స్పూన్
నిమ్మరసం - అర టీ స్పూను
గ్రీన్‌ చట్నీ - రెండు టీ సూన్లు
కారం - ఒకటిన్నర స్పూన్
స్వీట్‌ చట్నీ- రెండు టీస్పూన్లు
పంచదార - ఒక టీ స్పూను
బంగాళదుంప - ఒకటి
తురిమిన క్యారట్‌ - మూడు టేబుల్‌ స్పూన్లు
టొమేటో - ఒకటి
ఉల్లిపాయ - ఒకటి
పెసర మొలకలు - 1/4 కప్పు 
కొత్తిమీర - సన్నగా తరిగినది కొంచెం
పెరుగు - ఒక కప్పు
ఉప్పు - తగినంత


తయారుచేసే విధానం:

ముందుగా పెరుగులో పంచదార వేసి బాగా చిలికి ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. తరువాత ఆలూని ఉడికించి చిన్న చిన్న ముక్కలుగా కట్‌ చేసి పెట్టుకోవాలి.  ఒక గిన్నెలో ఆలూ ముక్కలు,  టొమేటో  ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, తురిమిన క్యారెట్‌, కొత్తిమీర, పెసర మొలకలు, ఉప్పు, కారం, చాట్‌ మసాలా, నిమ్మరసం వేసి బాగా కలపాలి. తరువాత కచోరీలు తీసుకుని వాటిని మధ్యలో జాగ్రత్తగా చాకుతో కట్‌ చేసి లోపల ఉన్న మిశ్రమాన్ని తీసేసి తయారుచేసుకున్న మిశ్రమాన్ని ఇందులో నింపాలి. ఇప్పుడు ఒక ప్లేట్‌లో కచోరిలు పెట్టి దానిపై పెరుగును వేయాలి.  దీనిపై గ్రీన్‌ చట్నీ, స్వీట్‌ చట్నీ, చాట్‌ మసాలా వేసుకోవాలి.

Related Recipes