ఇండిపెండెన్స్ డే స్పెషల్

 

ఓట్స్ లడ్డులు

 

 

కావలసిన పదార్ధాలు :

వేరుశనగ గుళ్ళు -      ఒక కప్పు
ఓట్స్              -       ఒక కప్పు
బెల్లం              -     ఒకటిన్నర కప్పు
నెయ్యి             -    రెండు మూడు స్పూన్లు
ఇలాచీ పొడి       -    ఒక స్పూన్

 

తయారీ :
ముందుగా స్టవ్ వెలిగించి  నెయ్యి వేడిచేసి ఓట్స్ ను దోరగా వేయించి బౌల్ లోకి తీసుకుని అదే పాన్ లో త వేరుశనగ గుళ్ళు వేయించి పొట్టు తీసుకోవాలి. తరువాత రెండిటిని మెత్తగా గ్రైండ్ చేయాలి.ఇప్పుడు ఇందులో తరిగిన బెల్లం,ఇలాచి పొడి వేసి మళ్ళీ గ్రైండ్ చెయ్యాలి. ఈ మిశ్రమాన్ని బౌల్ లోకి తీసుకుని కరిగిన నెయ్యి  వేసి కలిపి లడ్డూలు చేసుకుని సర్వ్ చేసుకోవాలి

 

 

 

యాపిల్ బ్రెడ్ హల్వా

 

 

 కావలసినవి:
యాపిల్  -       ఒకటి
బ్రెడ్         -      నాలుగు స్లైసెస్
పాలు       -      రెండు కప్పులు
నెయ్యి       -       మూడు టేబుల్ స్పూన్లు
పంచదార    -       ఒకటిన్నర కప్
ఇలాచీ పొడి  -      పావు స్పూన్
కాజూ,బాదం  -      20

 

 తయారీ:
ముందుగా యాపిల్ తురుము తీసి పెట్టుకోవాలి. బ్రెడ్ స్లైసెస్ ని క్రంబ్స్ గా చేసుకోవాలి. ఒక స్పూన్ నెయ్యి వేడిచేసి ఈ క్రంబ్స్ ను దోరగా వేయించి తీసుకోవాలి ఒక స్పూన్ నెయ్యి వేడిచేసి కాజూ వేయించి తీసుకోవాలి.ఇదే నేతిలో యాపిల్ తురుము వేసి వేయించాలి. తురుము వేగిన తరువాత బ్రెడ్ క్రంబ్స్ కూడా వేసి కలపాలి ఇప్పుడు పాలు, పంచదార వేసి సన్నని మంటపై బాగా దగ్గర పడేవరకు ఉడికించి ఇలాచీ పొడి,  నెయ్యి వేసి ఐదు నిముషాలు ఉడికాక స్టవ్ ఆఫ్ చేసి జీడిపప్పు బాదాం తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవాలి