హోం మేడ్ పిజ్జా

 


కావలసిన పదార్థాలు:
 
* మైదా - 1 కప్పు
* ఈస్ట్ - 2 స్పూన్స్
* వంటసోడా - 1/2 స్పూన్
* క్యాప్సికం - 1
* టమాటాలు - 3
* టమాటా సాస్ , వెన్న - (మన ఇష్టానికి తగినంత వేసుకోవచ్చును)
* పన్నీరు తురుము - 1/4 కప్పు

తయారు చేసే విధానం:

ఒక గిన్నెలో మైదా తీసుకుని అందులో  ఈస్ట్,వంటసోడా వేసి గోరువెచ్చటి నీటితో చపాతి పిండిలా కలుపుకుని 15 నిమిషాలు పక్కన  ఉంచాలి. ఇప్పుడు స్టవ్  వెలిగించుకుని కడాయిలో నూనె వేసి ముందుగా సన్నగా తరిగి ఉంచుకున్న క్యాప్సికం ముక్కలు, టమాటా ముక్కలు వేసి దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. నానిన పిండిని మరొకసారి బాగా మెదిపి, అర అంగుళం మందంలో గుండ్రంగా చపాతీలాగా చేతితో వత్తుకోవాలి. ఇప్పుడు పిజ్జా బేస్ తయారయ్యిందన్నమాట.ఇలా చేసిపెట్టుకున్న పిజ్జా బేస్ ని  స్టవ్ మీద ప్యాన్ సిమ్ లో పెట్టి ఆ ప్యాన్ కి  కొద్దిగా వెన్నరాసి దీనిని మూతపెట్టాలి. ఒక 5 నిమిషాలు అయ్యేసరికి పిజ్జా బేస్ మందంగా ఉబ్బుతుంది. ఇప్పుడు వేయించి పక్కన పెట్టుకున్న టమాటా మరియు  క్యాప్సికం ముక్కల మిశ్రమాన్ని బేస్ పైన వేసి, టమాటా సాస్, వెన్న, పన్నీరు తురుము వేసి మరికొద్దిసేపు ఉంచాలి. 10 నిముషాలు అయ్యాక ముక్కలుగా కోసుకొని హాయిగా తినచ్చు. అంతే పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టపడే వేడివేడి రుచికరమైన పిజ్జా ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు. 

--కళ్యాణి