వెజిటేరియన్ సలాడ్

 

 


మాములుగా మనం ఫ్రూట్ సలాడ్స్ తింటుంటాం. అయితే వెజిటేరియన్ సలాడ్స్ తీసుకోవడం వల్ల హెల్తీగా మరియు ఫిట్ గా ఉండవచ్చు. హెల్తీ వెజిటేరియన్ సలాడ్స్ తినడం వల్ల శరీరానికి అవసరమయ్యే అన్ని రకాల న్యూట్రీషియన్స్ అందుతాయి. ముఖ్యంగా ఈ హెల్తీ సలాడ్ డైట్ కాన్సియస్ ఉన్న వారు తీసుకుంటే చాలా మంచిది.

కావల్సిన పదార్థాలు:

* క్యారెట్ ముక్కలు      - 1/2 కప్పు

* స్ప్రింగ్ ఆనియన్స్     - 1/2 కప్పు

* టమోటోలు              - 1/2 కప్పు

* కీరదోసకాయ           - 1/2 కప్పు

*  స్వీట్ కార్న్             - 1/2 కప్పు

* ఆరెంజ్                    - 1/2 కప్పు

* వాటర్ మెలోన్          - 1/2 కప్పు

* ద్రాక్ష                       - 1/2 కప్పు

* పెప్పర్                    - 1/2 టీ స్పూన్

* నిమ్మరసం               - 1 టీ స్పూన్

* తేనె                        - 1/2 టీ స్పూన్

* ఉప్పు                       - రుచికి సరిపడా

తయారుచేయు విధానం:

1.  ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకుని అందులో కీరదోసకాయ, క్యారెట్, స్ప్రింగ్ ఆనియన్స్, స్వీట్ కార్న్ మరియు కొద్దిగా పెప్పర్ పౌడర్ వేసి మొత్తం మిశ్రమాన్ని మిక్స్ చేయాలి.

2. ఇప్పుడు ఆ మిశ్రమంలో మిగిలిన ఫ్రూట్స్ అన్నీ వేసి , చిటికెడు ఉప్పు, మిరియాల పొడి వేసి మొత్తం మిశ్రమాన్ని కలగలుపుకోవాలి.

3. ఆఖరిగా అందులో నిమ్మరసం వేసి.. మిశ్రమం పూర్తిగా మిక్స్ చేసిన తర్వాత చివరగా కొద్దిగా తేనెను టాపింగ్ గా మిక్స్ చేసి సర్వ్ చేయాలి. అంతే హెల్తీ ఫ్రూట్ సలాడ్ రెడీ..